ACTION ALREADY COMPLETED AT A PAST MOMENT

ACTION ALREADY COMPLETED AT A PAST MOMENT

గతంలో ఏదైనా ఒక సంఘటన జరిగిన సమయానికి,  అప్పటికే వేరొక పని పూర్తి అయిపోయింది అని చెప్పడానికి కూడా Past Perfect Tense  ఉపయోగిస్తారు.

ఈ భావాన్ని when, by the time, already ఉపయోగించి తెలియజేయవచ్చు.

ఎప్పుడూ కూడా ముందు జరిగిన పనిని Past perfect tense లో  చెప్పాలి

తరువాత జరిగిన పనిని Simple past  లో చెప్పాలి

 

When + తరువాత జరిగిన పని + ముందు జరిగిన పని

By the time + తరువాత జరిగిన పని + ముందు జరిగిన పని

Already + ముందు జరిగిన పని+ తరువాత జరిగిన పని

1. When I reached the office, the manager had left.
వెన్ ఐ రీచ్డ్ ది ఆఫీస్, ద మేనేజర్ హ్యాడ్ లెఫ్ట్.
నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోయారు.
When I reached the office, the manager had not left. నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోలేదు.
Had the manager left when I reached the office? నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోయారా?
Hadn’t the manager left when I reached the office? నేను కార్యాలయానికి చేరుకునేసరికి మేనేజర్ వెళ్లిపోలేదా?
2. When she opened the fridge, the milk had spoiled.
వెన్ షీ ఓపెండ్ ద ఫ్రిజ్, ద మిల్క్ హ్యాడ్ స్పాయిల్డ్.
ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోయాయి.
When she opened the fridge, the milk had not spoiled. ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోలేదు.
Had the milk spoiled when she opened the fridge? ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోయాయా?
Hadn’t the milk spoiled when she opened the fridge? ఆమె ఫ్రిజ్ తెరిచేసరికి పాలు పాడైపోలేదా?
3. When we entered the hall, the speech had begun.
వెన్ వి ఎంటర్డ్ ద హాల్, ద స్పీచ్ హ్యాడ్ బిగన్.
మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభమైంది.
When we entered the hall, the speech had not begun. మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభం కాలేదు.
Had the speech begun when we entered the hall? మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభమైందా?
Hadn’t the speech begun when we entered the hall? మేము హాలులోకి ప్రవేశించేసరికి ప్రసంగం ప్రారంభం కాలేదా?
4. By the time I woke up, my father had gone out.
బై ద టైమ్ ఐ వోక్ అప్, మై ఫాదర్ హ్యాడ్ గాన్ అవుట్.
నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోయారు.
By the time I woke up, my father had not gone out. నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లలేదు.
Had my father gone out by the time I woke up? నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోయారా?
Hadn’t my father gone out by the time I woke up? నేను నిద్రలేచేసరికి మా నాన్న బయటకు వెళ్లిపోలేదా?
5. By the time the doctor arrived, the bleeding had stopped.
బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్డ్, ద బ్లీడింగ్ హ్యాడ్ స్టాప్ట్.
డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగిపోయింది.
By the time the doctor arrived, the bleeding had not stopped. డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగలేదు.
Had the bleeding stopped by the time the doctor arrived? డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగిందా?
Hadn’t the bleeding stopped by the time the doctor arrived? డాక్టర్ వచ్చేసరికి రక్తస్రావం ఆగలేదా?
6. By the time we reached the bakery, it had sold all the bread.
బై ద టైమ్ వి రీచ్డ్ ద బేకరీ, ఇట్ హ్యాడ్ సోల్డ్ ఆల్ ద బ్రెడ్.
మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేశారు.
By the time we reached the bakery, it had not sold all the bread. మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేయలేదు.
Had it sold all the bread by the time we reached the bakery? మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేశారా?
Hadn’t it sold all the bread by the time we reached the bakery? మేము బేకరీకి చేరుకునేసరికి అక్కడ బ్రెడ్ అంతా అమ్మేయలేదా?
7. She had already washed the clothes when I offered to help.
షీ హ్యాడ్ ఆల్రెడీ వాష్ట్ ద క్లోత్స్ వెన్ ఐ ఆఫర్డ్ టు హెల్ప్.
నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతికింది.
She had not washed the clothes when I offered to help. నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె బట్టలు ఉతకలేదు.
Had she already washed the clothes when I offered to help? నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతికిందా?
Hadn’t she already washed the clothes when I offered to help? నేను సహాయం చేస్తానని చెప్పేసరికి ఆమె అప్పటికే బట్టలు ఉతకలేదా?
8. He had already booked a room when I called him.
హీ హ్యాడ్ ఆల్రెడీ బుక్ట్ ఎ రూమ్ వెన్ ఐ కాల్డ్ హిమ్.
నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేశాడు.
He had not booked a room when I called him. నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను గది బుక్ చేయలేదు.
Had he already booked a room when I called him? నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేశాడా?
Hadn’t he already booked a room when I called him? నేను అతనికి ఫోన్ చేసేసరికి అతను అప్పటికే గది బుక్ చేయలేదా?
9. They had already chosen a name when the baby was born.
దే హ్యాడ్ ఆల్రెడీ చోజన్ ఎ నేమ్ వెన్ ద బేబీ వజ్ బోర్న్.
బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకున్నారు.
They had not chosen a name when the baby was born. బిడ్డ పుట్టేసరికి వారు పేరు ఎంచుకోలేదు.
Had they already chosen a name when the baby was born? బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకున్నారా?
Hadn’t they already chosen a name when the baby was born? బిడ్డ పుట్టేసరికి వారు అప్పటికే ఒక పేరు ఎంచుకోలేదా?
10. We had already ordered food by the time Ravi joined us.
వి హ్యాడ్ ఆల్రెడీ ఆర్డర్డ్ ఫుడ్ బై ద టైమ్ రవి జాయిన్డ్ అస్.
రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేశాము.
We had not ordered food by the time Ravi joined us. రవి మాతో చేరేసరికి మేము భోజనం ఆర్డర్ చేయలేదు.
Had we already ordered food by the time Ravi joined us? రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేశామా?
Hadn’t we already ordered food by the time Ravi joined us? రవి మాతో చేరేసరికి మేము అప్పటికే భోజనం ఆర్డర్ చేయలేదా?

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *