CAUSE OF A PAST RESULT

CAUSE OF A PAST RESULT

గతంలో ఒక సంభవం జరుగుతుంది ఆ సంభవం  జరగటానికి అంతకుముందు కారణమైన పనిని గురించి తెలియజేయడానికి కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు

ఆ  సంభవం  జరగడానికి కారణమైన పనిని గురించి తెలియజేయడానికి Because, So ఉపయోగిస్తారు

ముందు జరిగిన కారణం PAST PERFECT TENSE లోనూ

తరువాత సంభవించిన సంభవాన్ని SIMPLE PAST  లో  తెలియజేస్తారు

 

కారణం తెలియజేయడానికి Because  ఉపయోగించినట్లయితే 

సింపుల్ పాస్ట్ + Because + ఫాస్ట్ పర్ఫెక్ట్

 

కారణం తెలియజేయడానికి So  ఉపయోగించినట్లయితే 

ఫాస్ట్ పర్ఫెక్ట్ + So + సింపుల్ పాస్ట్

 

1. She was happy because she had passed the exam.
షీ వజ్ హ్యాపీ బికాజ్ షీ హ్యాడ్ పాస్ట్ ది ఎగ్జామ్.
ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైనందువల్ల సంతోషంగా ఉంది.
She was not happy because she had not passed the exam. ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం వల్ల సంతోషంగా లేదు.
Was she happy because she had passed the exam? ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైనందువల్ల సంతోషంగా ఉందా?
Wasn’t she happy because she had not passed the exam? ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం వల్ల సంతోషంగా లేదా?
2. He was tired because he had worked all day.
హీ వజ్ టైర్డ్ బికాజ్ హీ హ్యాడ్ వర్క్ట్ ఆల్ డే.
అతను రోజంతా పనిచేసినందువల్ల అలసిపోయాడు.
He was not tired because he had not worked all day. అతను రోజంతా పనిచేయకపోవడం వల్ల అలసిపోలేదు.
Was he tired because he had worked all day? అతను రోజంతా పనిచేసినందువల్ల అలసిపోయాడా?
Wasn’t he tired because he had not worked all day? అతను రోజంతా పనిచేయకపోవడం వల్ల అలసిపోలేదా?
3. The roads were wet because it had rained.
ద రోడ్స్ వర్ వెట్ బికాజ్ ఇట్ హ్యాడ్ రైన్డ్.
వర్షం కురిసినందువల్ల రోడ్లు తడిగా ఉన్నాయి.
The roads were not wet because it had not rained. వర్షం కురవకపోవడం వల్ల రోడ్లు తడిగా లేవు.
Were the roads wet because it had rained? వర్షం కురిసినందువల్ల రోడ్లు తడిగా ఉన్నాయా?
Weren’t the roads wet because it had not rained? వర్షం కురవకపోవడం వల్ల రోడ్లు తడిగా లేవా?
4. They were worried because their son had disappeared.
దే వర్ వర్రీడ్ బికాజ్ దేర్ సన్ హ్యాడ్ డిసపియర్డ్.
తమ కుమారుడు కనిపించకుండా పోయినందువల్ల వారు ఆందోళన చెందారు.
They were not worried because their son had not disappeared. తమ కుమారుడు కనిపించకుండా పోలేదు కాబట్టి వారు ఆందోళన చెందలేదు.
Were they worried because their son had disappeared? తమ కుమారుడు కనిపించకుండా పోయినందువల్ల వారు ఆందోళన చెందారా?
Weren’t they worried because their son had not disappeared? తమ కుమారుడు కనిపించకుండా పోలేదు కాబట్టి వారు ఆందోళన చెందలేదా?
5. I was hungry because I had missed lunch.
ఐ వజ్ హంగ్రీ బికాజ్ ఐ హ్యాడ్ మిస్ట్ లంచ్.
నేను మధ్యాహ్న భోజనం మానేసినందువల్ల ఆకలిగా ఉన్నాను.
I was not hungry because I had not missed lunch. నేను మధ్యాహ్న భోజనం మానలేదు కాబట్టి ఆకలిగా లేను.
Was I hungry because I had missed lunch? నేను మధ్యాహ్న భోజనం మానేసినందువల్ల ఆకలిగా ఉన్నానా?
Wasn’t I hungry because I had not missed lunch? నేను మధ్యాహ్న భోజనం మానలేదు కాబట్టి ఆకలిగా లేనా?
6. Ravi had missed the bus, so he took a taxi.
రవి హ్యాడ్ మిస్ట్ ద బస్, సో హీ టుక్ ఎ టాక్సీ.
రవి బస్సు మిస్ అయ్యాడు, అందువల్ల టాక్సీ తీసుకున్నాడు.
Ravi had not missed the bus, so he did not take a taxi. రవి బస్సు మిస్ కాలేదు, అందువల్ల టాక్సీ తీసుకోలేదు.
Ravi had missed the bus, so did he take a taxi? రవి బస్సు మిస్ అయ్యాడు, కాబట్టి అతను టాక్సీ తీసుకున్నాడా?
Ravi had not missed the bus, so didn’t he take a taxi? రవి బస్సు మిస్ కాలేదు, కాబట్టి అతను టాక్సీ తీసుకోలేదా?
7. She had lost her keys, so she called her brother.
షీ హ్యాడ్ లాస్ట్ హర్ కీస్, సో షీ కాల్డ్ హర్ బ్రదర్.
ఆమె తాళాలు పోగొట్టుకుంది, అందువల్ల తన సోదరుడికి ఫోన్ చేసింది.
She had not lost her keys, so she did not call her brother. ఆమె తాళాలు పోగొట్టుకోలేదు, అందువల్ల తన సోదరుడికి ఫోన్ చేయలేదు.
She had lost her keys, so did she call her brother? ఆమె తాళాలు పోగొట్టుకుంది, కాబట్టి తన సోదరుడికి ఫోన్ చేసిందా?
She had not lost her keys, so didn’t she call her brother? ఆమె తాళాలు పోగొట్టుకోలేదు, కాబట్టి తన సోదరుడికి ఫోన్ చేయలేదా?
8. We had saved enough money, so we bought a car.
వి హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ, సో వి బాట్ ఎ కార్.
మేము సరిపడా డబ్బు పొదుపు చేశాము, అందువల్ల కారు కొన్నాము.
We had not saved enough money, so we did not buy a car. మేము సరిపడా డబ్బు పొదుపు చేయలేదు, అందువల్ల కారు కొనలేదు.
We had saved enough money, so did we buy a car? మేము సరిపడా డబ్బు పొదుపు చేశాము, కాబట్టి కారు కొన్నామా?
We had not saved enough money, so didn’t we buy a car? మేము సరిపడా డబ్బు పొదుపు చేయలేదు, కాబట్టి కారు కొనలేదా?
9. The machine had stopped, so the workers called a mechanic.
ద మెషీన్ హ్యాడ్ స్టాప్ట్, సో ద వర్కర్స్ కాల్డ్ ఎ మెకానిక్.
యంత్రం ఆగిపోయింది, అందువల్ల కార్మికులు మెకానిక్‌ను పిలిచారు.
The machine had not stopped, so the workers did not call a mechanic. యంత్రం ఆగిపోలేదు, అందువల్ల కార్మికులు మెకానిక్‌ను పిలవలేదు.
The machine had stopped, so did the workers call a mechanic? యంత్రం ఆగిపోయింది, కాబట్టి కార్మికులు మెకానిక్‌ను పిలిచారా?
The machine had not stopped, so didn’t the workers call a mechanic? యంత్రం ఆగిపోలేదు, కాబట్టి కార్మికులు మెకానిక్‌ను పిలవలేదా?
10. He had forgotten his wallet, so he borrowed money.
హీ హ్యాడ్ ఫర్‌గాటెన్ హిస్ వాలెట్, సో హీ బారోడ్ మనీ.
అతను తన పర్సు మరిచిపోయాడు, అందువల్ల డబ్బు అప్పుగా తీసుకున్నాడు.
He had not forgotten his wallet, so he did not borrow money. అతను తన పర్సు మరిచిపోలేదు, అందువల్ల డబ్బు అప్పుగా తీసుకోలేదు.
He had forgotten his wallet, so did he borrow money? అతను తన పర్సు మరిచిపోయాడు, కాబట్టి డబ్బు అప్పుగా తీసుకున్నాడా?
He had not forgotten his wallet, so didn’t he borrow money? అతను తన పర్సు మరిచిపోలేదు, కాబట్టి డబ్బు అప్పుగా తీసుకోలేదా?

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *