ACTION COMPLETED BY A SPECIFIC PAST TIME

ACTION COMPLETED BY A SPECIFIC PAST TIME

గతంలోని ఒక నిర్దిష్ట సమయానికల్లా ఒక పని పూర్తయి ఉండటాన్ని తెలియజేయడానికి  కూడా Past Perfect Tense ఉపయోగిస్తారు.

By, Before, By then, By that time, లాంటి పదాలను సమయ నిర్ధారణకు ఉపయోగిస్తారు

1. She had finished the work by 5 p.m.
షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బై ఫైవ్ పీ ఎమ్.
ఆమె సాయంత్రం ఐదు గంటలకల్లా పనిని పూర్తిచేసింది.
She had not finished the work by 5 p.m. ఆమె సాయంత్రం ఐదు గంటలకల్లా పనిని పూర్తిచేయలేదు.
Had she finished the work by 5 p.m.? ఆమె సాయంత్రం ఐదు గంటలకల్లా పనిని పూర్తిచేసిందా?
Hadn’t she finished the work by 5 p.m.? ఆమె సాయంత్రం ఐదు గంటలకల్లా పనిని పూర్తిచేయలేదా?
2. He had paid the bill by Monday.
హీ హ్యాడ్ పెయిడ్ ద బిల్ బై మండే.
అతను సోమవారానికల్లా బిల్లు చెల్లించాడు.
He had not paid the bill by Monday. అతను సోమవారానికల్లా బిల్లు చెల్లించలేదు.
Had he paid the bill by Monday? అతను సోమవారానికల్లా బిల్లు చెల్లించాడా?
Hadn’t he paid the bill by Monday? అతను సోమవారానికల్లా బిల్లు చెల్లించలేదా?
3. We had reached the village by sunset.
వి హ్యాడ్ రీచ్డ్ ద విలేజ్ బై సన్‌సెట్.
మేము సూర్యాస్తమయానికల్లా గ్రామానికి చేరుకున్నాము.
We had not reached the village by sunset. మేము సూర్యాస్తమయానికల్లా గ్రామానికి చేరుకోలేదు.
Had we reached the village by sunset? మేము సూర్యాస్తమయానికల్లా గ్రామానికి చేరుకున్నామా?
Hadn’t we reached the village by sunset? మేము సూర్యాస్తమయానికల్లా గ్రామానికి చేరుకోలేదా?
4. She had submitted the form before noon.
షీ హ్యాడ్ సబ్మిటెడ్ ద ఫారమ్ బిఫోర్ నూన్.
ఆమె మధ్యాహ్నానికి ముందే ఫారమ్ సమర్పించింది.
She had not submitted the form before noon. ఆమె మధ్యాహ్నానికి ముందు ఫారమ్ సమర్పించలేదు.
Had she submitted the form before noon? ఆమె మధ్యాహ్నానికి ముందే ఫారమ్ సమర్పించిందా?
Hadn’t she submitted the form before noon? ఆమె మధ్యాహ్నానికి ముందే ఫారమ్ సమర్పించలేదా?
5. By then, they had repaired the car.
బై దెన్, దే హ్యాడ్ రిపేర్డ్ ద కార్.
అప్పటికల్లా వారు కారును బాగుచేశారు.
By then, they had not repaired the car. అప్పటికల్లా వారు కారును బాగుచేయలేదు.
Had they repaired the car by then? అప్పటికల్లా వారు కారును బాగుచేశారా?
Hadn’t they repaired the car by then? అప్పటికల్లా వారు కారును బాగుచేయలేదా?
6. By that time, the guests had arrived.
బై దాట్ టైమ్, ద గెస్ట్స్ హ్యాడ్ అరైవ్డ్.
ఆ సమయానికల్లా అతిథులు వచ్చేశారు.
By that time, the guests had not arrived. ఆ సమయానికల్లా అతిథులు రాలేదు.
Had the guests arrived by that time? ఆ సమయానికల్లా అతిథులు వచ్చారా?
Hadn’t the guests arrived by that time? ఆ సమయానికల్లా అతిథులు రాలేదా?
7. By the time I arrived, the shop had closed.
బై ద టైమ్ ఐ అరైవ్డ్, ద షాప్ హ్యాడ్ క్లోజ్డ్.
నేను చేరుకునేసరికి దుకాణం మూసివేసింది.
By the time I arrived, the shop had not closed. నేను చేరుకునేసరికి దుకాణం మూసివేయలేదు.
Had the shop closed by the time I arrived? నేను చేరుకునేసరికి దుకాణం మూసివేసిందా?
Hadn’t the shop closed by the time I arrived? నేను చేరుకునేసరికి దుకాణం మూసివేయలేదా?
8. They had built the bridge by 2015.
దే హ్యాడ్ బిల్ట్ ద బ్రిడ్జ్ బై ట్వెంటీ ఫిఫ్టీన్.
వారు 2015 నాటికి వంతెనను నిర్మించారు.
They had not built the bridge by 2015. వారు 2015 నాటికి వంతెనను నిర్మించలేదు.
Had they built the bridge by 2015? వారు 2015 నాటికి వంతెనను నిర్మించారా?
Hadn’t they built the bridge by 2015? వారు 2015 నాటికి వంతెనను నిర్మించలేదా?
9. He had already packed his bag by midnight.
హీ హ్యాడ్ ఆల్రెడీ ప్యాక్డ్ హిస్ బ్యాగ్ బై మిడ్‌నైట్.
అతను అర్ధరాత్రికల్లా తన సంచిని అప్పటికే సర్దుకున్నాడు.
He had not packed his bag by midnight. అతను అర్ధరాత్రికల్లా తన సంచిని సర్దుకోలేదు.
Had he already packed his bag by midnight? అతను అర్ధరాత్రికల్లా తన సంచిని అప్పటికే సర్దుకున్నాడా?
Hadn’t he already packed his bag by midnight? అతను అర్ధరాత్రికల్లా తన సంచిని అప్పటికే సర్దుకోలేదా?
10. Ravi had completed the report by Friday.
రవి హ్యాడ్ కంప్లీటెడ్ ద రిపోర్ట్ బై ఫ్రైడే.
రవి శుక్రవారానికల్లా నివేదికను పూర్తిచేశాడు.
Ravi had not completed the report by Friday. రవి శుక్రవారానికల్లా నివేదికను పూర్తిచేయలేదు.
Had Ravi completed the report by Friday? రవి శుక్రవారానికల్లా నివేదికను పూర్తిచేశాడా?
Hadn’t Ravi completed the report by Friday? రవి శుక్రవారానికల్లా నివేదికను పూర్తిచేయలేదా?

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *