Recurring Action before another previous Action:
గతంలో జరిగిపోయిన ఒక పనికి ముందు రిపీటెడ్ గా జరిగిన మరొక పనిని వివరించడానికి ఈ Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.
Example:
| 1.I had been calling her several times before she finally answered. | ఆమె చివరకు సమాధానం ఇవ్వడానికి ముందు నేను ఆమెకు చాలాసార్లు కాల్ చేస్తూ ఉండినాను |
| 2.They had been visiting their grandparents every weekend before they moved away. | వారు దూరంగా వెళ్లడానికి ముందు ప్రతి వారాంతంలో వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండేవారు. |
| 3.She had been practicing her speech every day before the big presentation. | పెద్ద ప్రదర్శనకు ముందు ఆమె ప్రతిరోజూ తన ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. |
| 4.He had been checking his email constantly before the important message arrived. | ముఖ్యమైన సందేశం రాకముందే అతను తన ఇమెయిల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండినాడు. |
| 5.We had been meeting at the café regularly before it closed down. | కేఫ్ మూసివేయడానికి ముందు మేము క్రమం తప్పకుండా అక్కడ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. |
| 6.They had been playing the same song repeatedly before they perfected it. | వారు దానిని పరిపూర్ణం చేయడానికి ముందు వారు ఒకే పాటను పదేపదే ప్లే చేస్తూ ఉండినారు. |
| 7.I had been trying to reach him for hours before he picked up the phone. | అతను ఫోన్ తీయడానికి ముందు నేను అతనిని చేరుకోవడానికి గంటల తరబడి ప్రయత్నిస్తూ ఉండినాను. |
| 8.She had been rehearsing her lines over and over before the play started. | ఆట ప్రారంభానికి ముందు ఆమె తన పంక్తులను పదే పదే రిహార్సల్ చేస్తూ ఉండేది. |
| 9.He had been asking for feedback frequently before submitting his report. | అతను తన నివేదికను సమర్పించే ముందు తరచుగా అభిప్రాయాన్ని అడుగుతూ ఉండేవాడు. |
| 10.We had been reviewing the plans several times before we finalized them. | మేము ప్లాన్లను ఖరారు చేయడానికి ముందు చాలాసార్లు సమీక్షిస్తూ ఉండినాము. |
| We had not been reviewing the plans several times before we finalized them. | మేము ప్లాన్లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు సమీక్షిస్తూ ఉండలేదు. |
| Had we been reviewing the plans several times before we finalized them? | మేము ప్లాన్లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు సమీక్షిస్తూ ఉండినామా? |
| Had we not been reviewing the plans several times before we finalized them? | మేము ప్లాన్లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు సమీక్షిస్తూ ఉండ లేదా? |
