INTERRUPTED ACTIONS

INTERRUPTED ACTIONS

Interrupted Actions:                

గతంలో ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా మరొక పని జరిగినట్లు తెలియజేయడానికి Past Continuous Tenseతో when ఉపయోగిస్తాము.

కొంతసేపటి నుంచి కొనసాగుతున్న పనిని Past Continuous Tenseలో, ఆ పనికి మధ్యలో జరిగిన చిన్న లేదా ఆకస్మిక సంఘటనను Simple Past Tenseలో రాస్తాము.

Structure

Subject + was/were + V4 + object + when + subject + V2 + object.

I was reading a book when the doorbell rang.
నేను పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు డోర్‌బెల్ మోగింది.

ఇక్కడ:

  • was reading — అప్పటికే కొనసాగుతున్న పని
  • rang — మధ్యలో జరిగిన ఆకస్మిక సంఘటన
  • when — రెండు సంఘటనలను కలుపుతుంది

When clause‌ను వాక్యం ప్రారంభంలో కూడా ఉపయోగించవచ్చు:

When the doorbell rang, I was reading a book.

గమనిక: When clause వాక్యం ప్రారంభంలో ఉంటే, దాని తరువాత comma పెట్టాలి. చివరలో ఉంటే సాధారణంగా comma అవసరం లేదు.

  1. I was walking to school when it started raining.
    నేను పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వర్షం మొదలైంది.
  2. She was washing the dishes when the glass broke.
    ఆమె పాత్రలు కడుగుతూ ఉన్నప్పుడు గ్లాసు పగిలింది.
  3. He was driving the car when he saw an accident.
    అతను కారు నడుపుతూ ఉన్నప్పుడు ఒక ప్రమాదాన్ని చూశాడు.
  4. We were having dinner when the lights went out.
    మేము రాత్రి భోజనం చేస్తూ ఉన్నప్పుడు లైట్లు ఆరిపోయాయి.
  5. The children were playing outside when their mother called them.
    పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నప్పుడు వారి అమ్మ వారిని పిలిచింది.
  6. They were waiting for the bus when they heard a loud noise.
    వారు బస్సు కోసం వేచి చూస్తున్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది.
  7. I was talking to my friend when my teacher entered the classroom.
    నేను నా స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు మా ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చారు.
When clause‌ను వాక్యం ప్రారంభంలో
When the alarm rang, I was sleeping peacefully. అలారం మోగినప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాను.
When the teacher entered, the students were making noise. ఉపాధ్యాయుడు లోపలికి వచ్చినప్పుడు విద్యార్థులు శబ్దం చేస్తూ ఉన్నారు.
When the dog barked, she was opening the gate. కుక్క మొరిగినప్పుడు ఆమె గేటు తెరుస్తూ ఉంది.
When the bus arrived, we were buying tickets. బస్సు వచ్చినప్పుడు మేము టికెట్లు కొంటూ ఉన్నాము.
When the baby started crying, his mother was preparing food. పాప ఏడవడం ప్రారంభించినప్పుడు అతని తల్లి ఆహారం తయారు చేస్తూ ఉంది.
When the police arrived, the thief was climbing the wall. పోలీసులు వచ్చినప్పుడు దొంగ గోడ ఎక్కుతూ ఉన్నాడు.
When I received your message, I was attending a meeting. నాకు మీ సందేశం వచ్చినప్పుడు నేను సమావేశంలో పాల్గొంటూ ఉన్నాను.
1.I was reading a book when the doorbell rang. డోర్ బెల్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతూ ఉండినాను.
I was not reading a book when the doorbell rang. డోర్ బెల్ మోగినప్పుడు నేను పుస్తకం  చదువుతూ ఉండలేదు.
Was I reading a book when the doorbell rang? డోర్‌బెల్ మోగినప్పుడు నేను పుస్తకం  చదువుతూ ఉండి నాన?
Was I not reading a book when the doorbell rang? డోర్‌బెల్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతూ ఉండలేదా?
2.She was cooking dinner when the power went out. ఆమె రాత్రి భోజనం వండుతుండగా కరెంటు పోయింది.
She was not cooking dinner when the power went out. కరెంటు పోయినప్పుడు ఆమె రాత్రి భోజనం వండుతూ ఉండలేదు.
Was she cooking dinner when the power went out? కరెంటు పోయినప్పుడు ఆమె రాత్రి భోజనం  వండుతూ ఉండిందా?
Was she not cooking dinner when the power went out? కరెంటు పోయినప్పుడు ఆమె రాత్రి భోజనం వండుతూ ఉండలేదా?
3.They were watching TV when the phone suddenly rang. వారు టీవీ చూస్తుండగా హఠాత్తుగా ఫోన్ మోగింది.
They were not watching TV when the phone suddenly rang. అకస్మాత్తుగా ఫోన్ మోగినప్పుడు వారు టీవీ చూస్తూ ఉండలేదు.
Were they watching TV when the phone suddenly rang?  అకస్మాత్తుగా ఫోన్ మోగినప్పుడు వారు టీవీ చూస్తూ ఉండినారా?
Were they not watching TV when the phone suddenly rang?  అకస్మాత్తుగా ఫోన్ మోగినప్పుడు వారు టీవీ చూస్తూ ఉండలేదా?
4.He was taking a nap when the neighbors started a loud party. ఇరుగుపొరుగువారు ఒక గోల పార్టీని ప్రారంభించినప్పుడు అతను నిద్రపోతూ ఉండినాడు.
He was not taking a nap when the neighbors started a loud party. ఇరుగుపొరుగువారు ఒక గోల పార్టీని ప్రారంభించినప్పుడు అతను నిద్రపోతూ ఉండలేదు.
Was he taking a nap when the neighbors started a loud party? ఇరుగుపొరుగువారు ఒక గోల పార్టీని ప్రారంభించినప్పుడు అతను నిద్రపోతూ  ఉండినాడా?
Was he not taking a nap when the neighbors started a loud party? ఇరుగుపొరుగువారు ఒక గోల పార్టీని ప్రారంభించినప్పుడు అతను నిద్రపోతూ  ఉండ లేదా?
5.We were having a picnic when it began to rain. వర్షం ప్రారంభమైనప్పుడు మేము విహారయాత్ర చేస్తూ ఉండినాము.
We were not having a picnic when it began to rain. వర్షం ప్రారంభమైనప్పుడు మేము విహారయాత్ర చేస్తూ ఉండలేదు.
Were we having a picnic when it began to rain? వర్షం ప్రారంభమైనప్పుడు మేము విహారయాత్ర చేస్తూ ఉండినామా?
Were we not having a picnic when it began to rain? వర్షం ప్రారంభమైనప్పుడు మేము విహారయాత్ర చేస్తూ  ఉండలేదా?
6.I was writing an email when my computer froze. నా కంప్యూటర్ స్తంభించినప్పుడు నేను ఇమెయిల్  రాస్తూ ఉండినాను.
I was not writing an email when my computer froze. నా కంప్యూటర్ స్తంభించినప్పుడు నేను ఇమెయిల్  రాస్తూ  ఉండలేదు.
Was I writing an email when my computer froze? నా కంప్యూటర్ స్తంభించినప్పుడు నేను ఇమెయిల్  రాస్తూ ఉండినాన?
Was I not writing an email when my computer froze? నా కంప్యూటర్ స్తంభించినప్పుడు నేను ఇమెయిల్  రాస్తూ  ఉండలేదా?
7.She was jogging in the park when she saw an old friend. ఆమె పాత స్నేహితుడిని చూసినప్పుడు పార్కులో  జాగింగ్ చేస్తూ ఉండినది.
She was not jogging in the park when she saw an old friend. ఆమె పాత స్నేహితుడిని చూసినప్పుడు పార్కులో  జాగింగ్ చేస్తూ  ఉండలేదు.
Was she jogging in the park when she saw an old friend? ఆమె పాత స్నేహితుడిని చూసినప్పుడు పార్కులో  జాగింగ్ చేస్తూ  ఉండినదా.?
Was she not jogging in the park when she saw an old friend? ఆమె పాత స్నేహితుడిని చూసినప్పుడు పార్కులో  జాగింగ్ చేస్తూ  ఉండ లేదా.?
8.They were playing a board game when the lights went out. లైట్లు ఆరిపోయినప్పుడు వారు బోర్డ్ గేమ్ ఆడుతూ ఉండినారు.
They were not playing a board game when the lights went out. లైట్లు ఆరిపోయినప్పుడు వారు బోర్డ్ గేమ్ ఆడుతూ  ఉండలేదు.
Were they playing a board game when the lights went out? లైట్లు ఆరిపోయినప్పుడు వారు బోర్డ్ గేమ్ ఆడుతూ  ఉండినారా?
Were they not playing a board game when the lights went out? లైట్లు ఆరిపోయినప్పుడు వారు బోర్డ్ గేమ్ ఆడుతూ ఉండలేదా?
9.He was fixing his car when he realized he had lost his tools. అతను తన పనిముట్లను పోగొట్టుకున్నాడని గ్రహించినప్పుడు అతను తన కారును సరి చేస్తూ ఉండినాడు.
He was not fixing his car when he realized he had lost his tools. అతను తన పనిముట్లను పోగొట్టుకున్నాడని తెలుసుకున్నప్పుడు అతను తన కారును  సరి చేస్తూ ఉండలేదు.
Was he fixing his car when he realized he had lost his tools? అతను తన సాధనాలను పోగొట్టుకున్నాడని తెలుసుకున్నప్పుడు అతను తన కారును  సరి చేస్తూ ఉండినాడా?
Was he not fixing his car when he realized he had lost his tools? అతను తన ఉపకరణాలను పోగొట్టుకున్నాడని తెలుసుకున్నప్పుడు అతను తన కారును  సరి చేస్తూ ఉండలేదా?
10.We were exploring the city when we got caught in a traffic jam. మేము ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు మేము నగరాన్ని  అన్వేషిస్తూ ఉండినాము.
We were not exploring the city when we got caught in a traffic jam. మేము ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు మేము నగరాన్ని  అన్వేషిస్తూ ఉండలేదు.
Were we exploring the city when we got caught in a traffic jam? మేము ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు నగరాన్ని  అన్వేషిస్తూ ఉండినామా?
Were we not exploring the city when we got caught in a traffic jam? మేము ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు నగరాన్ని  అన్వేషిస్తూ ఉండలేదా?

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *