INTRODUCTION

INTRODUCTION

Present continuous tense 

 

Main Meaning: ఒక పని ఎప్పుడు ప్రారంభమైందో మనకి అనవసరం, ఎప్పుడు ముగుస్తుందో మనకు అనవసరం, కానీ ప్రస్తుతానికి కంటిన్యూ గా ఆగకుండా  జరుగుతూ ఉంటే, దాన్ని ఈ Present continuous tense లో తెలియజేస్తారు.

ప్రదానమైన అర్దం ఇదే అని గుర్తు పెట్టుకోండి,  కానీ present continuous tense వివిద సందర్బాలలో ఎలా ఉపయోగిస్తారో క్రింద వివరించాము.

 

Present continous tense లో,అన్ని సింగులర్ సబ్జెక్టులకు మరియు ఫ్లూరల్ సబ్జెక్టులకు VERB FOUR  (ing) కామన్ గా ఉపయోగిస్తారు.

Verb1 + ing = V4 అని కూడా అంటారు.

Examples:

Go+ing = Going.

Come+ing = Coming.

Run+ing = Running.

 

1. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “I” ఉన్నప్పుడు am అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

I + am + v4  + object.

 

2.ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “ He, She It , That ” ఉన్నప్పుడు “is”  అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

He, She, It   + is + v4+ Object

 

3.ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “ we, you , they ” ఉన్నప్పుడు “are”  అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

We, You, They  + are + v4 + Object

 

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలను వ్యతిరేక వాక్యాలుగా మార్చడానికి am, is,are  పక్కన Not  చేర్చాలి.

Example:

She is reading a book right now. (PS) (ఆమె ప్రస్తుతం పుస్తకం చదువుతూ ఉంది  )

పై వాక్యమును నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు is ప్రక్కన Not చేర్చాలి.

She is not reading a book right now (NS)

పాజిటివ్ సెంటెన్స్ మరియు నెగటివ్ సెంటెన్స్ రెండింటినీ ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన is ని సబ్జెక్ట్ అయిన she కి ముందు ఉంచాలి.

Is she reading a book right now. (IS)

Is she not reading a book right now (NIS) is not = isn’t   (Isn’t she reading a book right now అని కూడా చదవవచ్చు.)

I + am + V4 + Object
1. I am reading a book.

ఐ యామ్ రీడింగ్ ఎ బుక్.

నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను.
2. I am writing a letter.

ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్.

నేను ఒక ఉత్తరం  రాస్తూ ఉన్నాను.
3. I am drinking water.

ఐ యామ్ డ్రింకింగ్ వాటర్.

నేను నీళ్లు   త్రాగుతూ ఉన్నాను.
4. I am eating breakfast.

ఐ యామ్ ఈటింగ్ బ్రేక్‌ఫాస్ట్.

నేను అల్పాహారం  తింటూ ఉన్నాను.
5. I am learning English.

ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లిష్.

నేను ఇంగ్లిష్  నేర్చుకుంటూ ఉన్నాను.
6. I am cleaning my room.

ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్.

నేను నా గదిని శుభ్రం  చేస్తూ ఉన్నాను.
7. I am watching a movie.

ఐ యామ్ వాచింగ్ ఎ మూవీ.

నేను ఒక సినిమా  చూస్తూ ఉన్నాను.
8. I am cooking dinner.

ఐ యామ్ కుకింగ్ డిన్నర్.

నేను రాత్రి భోజనం  వండుతూ ఉన్నాను.
9. I am opening the window.

ఐ యామ్ ఓపెనింగ్ ది విండో.

నేను కిటికీ  తెరుస్తూ ఉన్నాను.
10. I am carrying a bag.

ఐ యామ్ క్యారీయింగ్ ఎ బ్యాగ్.

నేను ఒక సంచి మోస్తూ ఉన్నాను.
11. I am buying vegetables.

ఐ యామ్ బయింగ్ వెజిటబుల్స్.

నేను కూరగాయలు  కొంటూ ఉన్నాను.
11(a). I am not buying vegetables. నేను కూరగాయలు కొనడం లేదు.
11(b). Am I buying vegetables? నేను కూరగాయలు కొంటున్నానా?
11(c). Am I not buying vegetables? నేను కూరగాయలు కొనడం లేదా?
12. I am washing the clothes.

ఐ యామ్ వాషింగ్ ది క్లోత్స్.

నేను బట్టలు ఉతుకుతూ ఉన్నాను.
12(a). I am not washing the clothes. నేను బట్టలు ఉతకడం లేదు.
12(b). Am I washing the clothes? నేను బట్టలు ఉతుకుతున్నానా?
12(c). Am I not washing the clothes? నేను బట్టలు ఉతకడం లేదా?
13. I am drawing a picture.

ఐ యామ్ డ్రాయింగ్ ఎ పిక్చర్.

నేను ఒక బొమ్మ గీస్తూ ఉన్నాను.
13(a). I am not drawing a picture. నేను బొమ్మ గీయడం లేదు.
13(b). Am I drawing a picture? నేను బొమ్మ గీస్తున్నానా?
13(c). Am I not drawing a picture? నేను బొమ్మ గీయడం లేదా?
14. I am answering the question.

ఐ యామ్ ఆన్సరింగ్ ది క్వశ్చన్.

నేను ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాను.
14(a). I am not answering the question. నేను ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.
14(b). Am I answering the question? నేను ప్రశ్నకు సమాధానం చెబుతున్నానా?
14(c). Am I not answering the question? నేను ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదా?
15. I am repairing my bicycle.

ఐ యామ్ రిపేరింగ్ మై బైసికల్.

నేను నా సైకిల్‌ను  బాగు చేస్తూ ఉన్నాను.
15(a). I am not repairing my bicycle. నేను నా సైకిల్‌ను బాగుచేయడం లేదు.
15(b). Am I repairing my bicycle? నేను నా సైకిల్‌ను బాగుచేస్తున్నానా?
15(c). Am I not repairing my bicycle? నేను నా సైకిల్‌ను బాగుచేయడం లేదా?
He / She / It + is + V4 (-ing) + Object
1. He is reading the newspaper.

హీ ఇజ్ రీడింగ్ ది న్యూస్‌పేపర్.

అతను వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు.
2. She is preparing tea.

షీ ఇజ్ ప్రిపేరింగ్ టీ.

ఆమె టీ తయారు  చేస్తూ ఉంది.
3. It is making a strange noise.

ఇట్ ఇజ్ మేకింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్.

అది ఒక వింత శబ్దం చేస్తూ ఉంది.
4. He is washing the car.

హీ ఇజ్ వాషింగ్ ది కార్.

అతను కారును కడుగుతూ ఉన్నాడు.
5. She is teaching a lesson.

షీ ఇజ్ టీచింగ్ ఎ లెసన్.

ఆమె ఒక పాఠం  బోధిస్తూ ఉంది.
6. It is displaying a message.

ఇట్ ఇజ్ డిస్‌ప్లేయింగ్ ఎ మెసేజ్.

అది ఒక సందేశాన్ని  చూపిస్తూ ఉంది.
7. He is playing the guitar.

హీ ఇజ్ ప్లేయింగ్ ది గిటార్.

అతను గిటార్  వాయిస్తు వున్నాడు.
8. She is arranging the books.

షీ ఇజ్ అరేంజింగ్ ది బుక్స్.

ఆమె పుస్తకాలను సర్దుతూ ఉంది.
9. It is recording the conversation.

ఇట్ ఇజ్ రికార్డింగ్ ది కాన్వర్సేషన్.

అది సంభాషణను రికార్డ్  చేస్తూ వుంది.
10. He is carrying a box.

హీ ఇజ్ క్యారీయింగ్ ఎ బాక్స్.

అతను ఒక పెట్టె మోస్తూ ఉన్నాడు.
11. She is watering the plants.

షీ ఇజ్ వాటరింగ్ ది ప్లాంట్స్.

ఆమె మొక్కలకు నీళ్లు  పోస్తూ ఉంది.
11(a). She is not watering the plants. ఆమె మొక్కలకు నీళ్లు పోయడం లేదు.
11(b). Is she watering the plants? ఆమె మొక్కలకు నీళ్లు పోస్తోందా?
11(c). Is she not watering the plants? ఆమె మొక్కలకు నీళ్లు పోయడం లేదా?
12. He is repairing the computer.

హీ ఇజ్ రిపేరింగ్ ది కంప్యూటర్.

అతను కంప్యూటర్‌ను బాగు చేస్తూ ఉన్నాడు.
12(a). He is not repairing the computer. అతను కంప్యూటర్‌ను బాగుచేయడం లేదు.
12(b). Is he repairing the computer? అతను కంప్యూటర్‌ను బాగుచేస్తున్నాడా?
12(c). Is he not repairing the computer? అతను కంప్యూటర్‌ను బాగుచేయడం లేదా?
13. It is downloading the file.

ఇట్ ఇజ్ డౌన్‌లోడింగ్ ది ఫైల్.

అది ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తూ ఉంది.
13(a). It is not downloading the file. అది ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదు.
13(b). Is it downloading the file? అది ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తోందా?
13(c). Is it not downloading the file? అది ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా?
14. She is stitching a dress.

షీ ఇజ్ స్టిచింగ్ ఎ డ్రెస్సు.

ఆమె ఒక దుస్తును కుడుతూ ఉంది.
14(a). She is not stitching a dress. ఆమె దుస్తును కుట్టడం లేదు.
14(b). Is she stitching a dress? ఆమె ఒక దుస్తును కుడుతోందా?
14(c). Is she not stitching a dress? ఆమె దుస్తును కుట్టడం లేదా?
15. He is feeding the dog.

హీ ఇజ్ ఫీడింగ్ ది డాగ్.

అతను కుక్కకు ఆహారం పెడుతూ ఉన్నాడు.
15(a). He is not feeding the dog. అతను కుక్కకు ఆహారం పెట్టడం లేదు.
15(b). Is he feeding the dog? అతను కుక్కకు ఆహారం పెడుతున్నాడా?
15(c). Is he not feeding the dog? అతను కుక్కకు ఆహారం పెట్టడం లేదా?
We / You / They + are + V4  + Object
1. We are planning a trip.

వీ ఆర్ ప్లానింగ్ ఎ ట్రిప్. 

మేము ఒక ప్రయాణాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాము.
2. You are reading the instructions.

యూ ఆర్ రీడింగ్ ది ఇన్‌స్ట్రక్షన్స్.

మీరు సూచనలను  చదువుతూ ఉన్నారు.
3. They are building a house.

దే ఆర్ బిల్డింగ్ ఎ హౌస్.

వారు ఒక ఇల్లు  కడుతూ ఉన్నారు.
4. We are discussing the problem.

వీ ఆర్ డిస్కసింగ్ ది ప్రాబ్లమ్.

మేము సమస్యను చర్చిస్తూ ఉన్నాను.
5. You are learning a new lesson.

యూ ఆర్ లెర్నింగ్ ఎ న్యూ లెసన్.

మీరు ఒక కొత్త పాఠం నేర్చుకుంటూ ఉన్నారు.
6. They are playing cricket.

దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్.

వారు క్రికెట్  ఆడుతూ ఉన్నారు.
7. We are preparing lunch.

వీ ఆర్ ప్రిపేరింగ్ లంచ్.

మేము మధ్యాహ్న భోజనం తయారు  చేస్తూ ఉన్నాను.
8. You are carrying the documents.

యూ ఆర్ క్యారీయింగ్ ది డాక్యుమెంట్స్.

మీరు పత్రాలను  తీసుకెళ్తూ ఉన్నారు.
9. They are cleaning the classroom.

దే ఆర్ క్లీనింగ్ ది క్లాస్‌రూమ్.

వారు తరగతి గదిని శుభ్రం చేస్తూ ఉన్నారు.
10. We are watching the match.

వీ ఆర్ వాచింగ్ ది మ్యాచ్.

మేము మ్యాచ్ చూస్తూ ఉన్నాము.
11. You are writing the answers.

యూ ఆర్ రైటింగ్ ది ఆన్సర్స్.

మీరు సమాధానాలు రాస్తు ఉన్నారు.
11(a). You are not writing the answers. మీరు సమాధానాలు రాయడం లేదు.
11(b). Are you writing the answers? మీరు సమాధానాలు రాస్తున్నారా?
11(c). Are you not writing the answers? మీరు సమాధానాలు రాయడం లేదా?
12. They are planting trees.

దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్.

వారు చెట్లు నాటుతూ ఉన్నారు.
12(a). They are not planting trees. వారు చెట్లు నాటడం లేదు.
12(b). Are they planting trees? వారు చెట్లు నాటుతున్నారా?
12(c). Are they not planting trees? వారు చెట్లు నాటడం లేదా?
13. We are organizing the event.

వీ ఆర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్.

మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.
13(a). We are not organizing the event. మేము కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
13(b). Are we organizing the event? మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామా?
13(c). Are we not organizing the event? మేము కార్యక్రమాన్ని నిర్వహించడం లేదా?
14. You are checking the email.

యూ ఆర్ చెకింగ్ ది ఈమెయిల్.

మీరు ఈమెయిల్‌ను  పరిశీలిస్తూ ఉన్నారు.
14(a). You are not checking the email. మీరు ఈమెయిల్‌ను పరిశీలించడం లేదు.
14(b). Are you checking the email? మీరు ఈమెయిల్‌ను పరిశీలిస్తున్నారా?
14(c). Are you not checking the email? మీరు ఈమెయిల్‌ను పరిశీలించడం లేదా?
15. They are painting the wall.

దే ఆర్ పెయింటింగ్ ది వాల్.

వారు గోడకు రంగు  వేస్తూ ఉన్నారు.
15(a). They are not painting the wall. వారు గోడకు రంగు వేయడం లేదు.
15(b). Are they painting the wall? వారు గోడకు రంగు వేస్తున్నారా?
15(c). Are they not painting the wall? వారు గోడకు రంగు వేయడం లేదా?