INTRODUCTION

గతంలో ఒక సంఘటన జరగడానికి ముందు కొంతకాలంగా జరుగుతూ వచ్చిన మరొక పనిని వివరించడానికి ఈ Past perfect Continuous Tense ని ఉపయోగిస్తారు.

He, She, It, I, We, You, They + had been + verb4 + object

PAST PERFECT మరియు PAST PERFECT  CONTINUOUS TENSE కి మధ్య తేడా ఏమిటి?

PAST PERFECT : గతంలో ఒక పని జరగడానికి ముందే పూర్తి అయిన మరియొక పనిని గురించి తెలియజేయడానికి PAST PERFECT ని ఉపయోగిస్తారు. దీనిని ముందు పాఠంలో మనం నేర్చుకున్నాము.

 

PAST PERFECT  CONTINUOUS: గతంలో ఒక పని జరగడానికి ముందు మరొక పని ఎంత కాలంగా జరుగుతూ ఉండేదో ఆ పని యొక్క కాలాన్ని తెలియజేస్తుంది. 

అనగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో ఒక పని జరగడానికి ముందే పూర్తి అయిన మరొక పనిని గురించి  వివరిస్తుంది.  

ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే  గతంలో అదే  పని జరగడానికి ముందు మరొక పని  ఎంత సమయం జరుగుతూ ఉండిందో ఆ సమయాన్ని తెలియజేస్తుంది.

 

క్రింది టేబుల్ గమనించండి. ఇవి గతంలో జరిగిన పనులు అని గుర్తుపెట్టుకోండి.

 

PAST PERFECT PAST PERFECT CONTINUOUS
1. I had completed the work before he arrived.
అతను రాకముందే నేను పని పూర్తి చేశాను.
1. I had been working for two hours before he arrived.
అతను రాకముందు నేను రెండు గంటలుగా పని చేస్తూ ఉన్నా జస్ట్ను.
2. She had cleaned the room before the guests arrived.
అతిథులు రాకముందే ఆమె గదిని శుభ్రం చేసింది.
2. She had been cleaning the room for an hour before the guests arrived.
అతిథులు రాకముందు ఆమె గంటసేపుగా గదిని శుభ్రం చేస్తూ ఉంది.
3. He had written the report before the manager arrived.
మేనేజర్ రాకముందే అతను నివేదికను రాశాడు.
3. He had been writing the report since morning before the manager arrived.
మేనేజర్ రాకముందు అతను ఉదయం నుంచి నివేదికను రాస్తూ ఉన్నాడు.
4. They had repaired the car before the rain started.
వర్షం ప్రారంభమవకముందే వారు కారును బాగుచేశారు.
4. They had been repairing the car for three hours before the rain started.
వర్షం ప్రారంభమవకముందు వారు మూడు గంటలుగా కారును బాగుచేస్తూ ఉన్నారు.
5. I had studied the chapter before the examination began.
పరీక్ష ప్రారంభమవకముందే నేను ఆ పాఠాన్ని చదివాను.
5. I had been studying the chapter for two hours before the examination began.
పరీక్ష ప్రారంభమవకముందు నేను రెండు గంటలుగా ఆ పాఠాన్ని చదువుతూ ఉన్నాను.

 

For: ఏదైనా ఒక పని గంటలుగా,  రోజులుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, జరుగుతూ ఉండింది అని చెప్పడానికి For ఉపయోగిస్తారు ఈ విధంగా చివరిలో   “గా”  అని వస్తుంది.

Sinnce:  ఏదైనా ఒక పని ప్రత్యేకంగా ఒక సమయం నుండి జరుగుతూ ఉంటుంది. అని చెప్పడానికి Since  ఉపయోగిస్తారు. ఈ విధంగా చివరలో “నుండి” అని వస్తుంది. 

 

అదేవిధంగా PAST PERFECT  CONTINUOUS: లో రెండు పనులను కలపడానికి ఈ క్రింది పదాలను ఉపయోగిస్తారు. 

When = ఆ సమయానికి

Before= వచ్చినప్పుడు / జరిగిన సమయానికి 

Because=ఎందుకంటే / కారణంగా 

By the time =ఆ సమయానికి 

ఏవి  మాత్రమే కాకుండా after , unitl లాంటివి కూడా ఉపయోగిస్తారు కానీ చాలా తక్కువగా ఉపయోగిస్తారు. 

 

1.When + తరువాత జరిగిన పని + ముందు జరుగుతూ ఉండిన పని:

1. When the bus arrived, we had been waiting for thirty minutes. బస్సు వచ్చిన సమయానికి మేము ముప్పై నిమిషాలుగా ఎదురుచూస్తూ ఉన్నాము.
2. When the teacher entered the classroom, the students had been talking for ten minutes. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చిన సమయానికి విద్యార్థులు పది నిమిషాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
3. When her mother came home, she had been studying for two hours. ఆమె తల్లి ఇంటికి వచ్చిన సమయానికి ఆమె రెండు గంటలుగా చదువుతూ ఉంది.
4. When I met Ravi, he had been living in Hyderabad since 2020. నేను రవిని కలిసిన సమయానికి అతను 2020 నుండి హైదరాబాద్‌లో నివసిస్తూ ఉన్నాడు.
5. When the rain started, they had been playing cricket since morning. వర్షం ప్రారంభమైన సమయానికి వారు ఉదయం నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
6. When the manager arrived, she had been working on the report since morning. మేనేజర్ వచ్చిన సమయానికి ఆమె ఉదయం నుండి నివేదికపై పనిచేస్తూ ఉంది.
When the manager arrived, she had not been working on the report since morning. మేనేజర్ వచ్చిన సమయానికి ఆమె ఉదయం నుండి నివేదికపై పనిచేస్తూ లేదు.
Had she been working on the report since morning when the manager arrived? మేనేజర్ వచ్చిన సమయానికి ఆమె ఉదయం నుండి నివేదికపై పనిచేస్తూ ఉందా?
Hadn’t she been working on the report since morning when the manager arrived? మేనేజర్ వచ్చిన సమయానికి ఆమె ఉదయం నుండి నివేదికపై పనిచేస్తూ లేదా?

 

2.ముందు జరుగుతూ ఉండిన పని + Before + తరువాత జరిగిన పని.

1. We had been waiting for thirty minutes before the bus arrived. బస్సు రాకముందు మేము ముప్పై నిమిషాలుగా ఎదురుచూస్తూ ఉన్నాము.
2. The students had been talking for ten minutes before the teacher entered the classroom. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాకముందు విద్యార్థులు పది నిమిషాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
3. She had been studying for two hours before her mother came home. ఆమె తల్లి ఇంటికి రాకముందు ఆమె రెండు గంటలుగా చదువుతూ ఉంది.
4. Ravi had been living in Hyderabad since 2020 before he moved to Chennai. చెన్నైకి మారకముందు రవి 2020 నుండి  హైదరాబాద్‌లో నివసిస్తూ ఉన్నాడు.
5. They had been playing cricket since morning before it started raining. వర్షం ప్రారంభమవకముందు వారు ఉదయం నుండి   క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
6. She had been working on the report since morning before the manager arrived. మేనేజర్ రాకముందు ఆమె ఉదయం నుండి   నివేదికపై పనిచేస్తూ ఉంది.
She had not been working on the report since morning before the manager arrived. మేనేజర్ రాకముందు ఆమె ఉదయం నుండి   నివేదికపై పనిచేస్తూ లేదు.
Had she been working on the report since morning before the manager arrived? మేనేజర్ రాకముందు ఆమె ఉదయం నుండి   నివేదికపై పనిచేస్తూ ఉందా?
Hadn’t she been working on the report since morning before the manager arrived? మేనేజర్ రాకముందు ఆమె ఉదయం నుండి   నివేదికపై పనిచేస్తూ లేదా?

 

3.By the time + తర్వాత జరిగిన పని + ముందు జరిగిన పని

   
1. By the time the bus arrived, we had been waiting for two hours. బస్సు వచ్చే సమయానికి మేము రెండు గంటలుగా ఎదురుచూస్తూ ఉన్నాము.
2. By the time the teacher entered the classroom, the students had been talking for ten minutes. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చే సమయానికి విద్యార్థులు పది నిమిషాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
3. By the time her mother came home, she had been studying for three hours. ఆమె తల్లి ఇంటికి వచ్చే సమయానికి ఆమె మూడు గంటలుగా చదువుతూ ఉంది.
4. By the time the manager arrived, she had been working since morning. మేనేజర్ వచ్చే సమయానికి ఆమె ఉదయం నుంచి పనిచేస్తూ ఉంది.
5. By the time it started raining, they had been playing cricket since noon. వర్షం ప్రారంభమయ్యే సమయానికి వారు మధ్యాహ్నం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
6. By the time the power went out, the machine had been running since morning. కరెంటు పోయే సమయానికి ఆ యంత్రం ఉదయం నుంచి నడుస్తూ ఉంది.
By the time the power went out, the machine had not been running since morning. కరెంటు పోయే సమయానికి ఆ యంత్రం ఉదయం నుంచి నడుస్తూ లేదు.
Had the machine been running since morning by the time the power went out? కరెంటు పోయే సమయానికి ఆ యంత్రం ఉదయం నుంచి నడుస్తూ ఉందా?
Hadn’t the machine been running since morning by the time the power went out? కరెంటు పోయే సమయానికి ఆ యంత్రం ఉదయం నుంచి నడుస్తూ లేదా?

 

4.తరువాత జరిగిన పని + Because + ముందు జరిగిన పని

1. The ground was wet because it had been raining all night. రాత్రంతా వర్షం కురుస్తూ ఉండటం వల్ల నేల తడిగా ఉంది.
2. Ravi was exhausted because he had been working for six hours. రవి ఆరు గంటలుగా పనిచేస్తూ ఉండటం వల్ల బాగా అలసిపోయాడు.
3. The roads were slippery because it had been snowing since midnight. అర్ధరాత్రి నుంచి మంచు కురుస్తూ ఉండటం వల్ల రోడ్లు జారుడుగా ఉన్నాయి.
4. The children’s clothes were dirty because they had been playing in the mud. పిల్లలు బురదలో ఆడుతూ ఉండటం వల్ల వారి దుస్తులు మురికిగా ఉన్నాయి.
5. Her eyes were sore because she had been reading for several hours. ఆమె కొన్ని గంటలుగా చదువుతూ ఉండటం వల్ల కళ్లు నొప్పిగా ఉన్నాయి.
6. The house smelled of paint because the painters had been painting since morning. పెయింటర్లు ఉదయం నుంచి పెయింటింగ్ చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో పెయింట్ వాసన వచ్చింది.
7. The engine was hot because it had been running for a long time. ఇంజిన్ చాలాసేపుగా నడుస్తూ ఉండటం వల్ల వేడిగా ఉంది.
8. The team felt confident because they had been training for several months. వారు కొన్ని నెలలుగా శిక్షణ పొందుతూ ఉండటం వల్ల జట్టు సభ్యులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
9. The garden looked fresh because the gardener had been watering it since early morning. తోటమాలి తెల్లవారుజాము నుంచి నీళ్లు పోస్తూ ఉండటం వల్ల తోట తాజాగా కనిపించింది.
10. His voice was hoarse because he had been speaking for two hours. అతను రెండు గంటలుగా మాట్లాడుతూ ఉండటం వల్ల అతని గొంతు బొంగురుగా మారింది.