ఈ క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Have
Has
Have
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I, We, You, They లకు ‘Have’ సహాయక క్రియ ఉపయోగించి . వాక్యంలో ఉన్న సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో తెలియజేస్తారు (Possessive sentences).
Have = కలిగియుండుట
Example : You have a bike (నీకు ఒక బైకు ఉన్నది లేదా నీవు ఒక బైక్ ని కలిగి ఉన్నావు)
పై వాక్యాన్ని క్రింది విధంగా కూడా రాయవచ్చు.
You do have a bike. కానీ సాధారణంగా మాట్లాడేటప్పుడు Do ఉపయోగించరు. కానీ వ్యతిరేక వాక్యాలు, ప్రశ్నా వాక్యాలు రాసేటప్పుడు Do తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఈ వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు Do ప్రక్కన not చేరిస్తే సరిపోతుంది.
You do not have a bike. (Negative sentences ) పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Do ని సబ్జెక్టు You కి ముందు పెడితే సరిపోతుంది.
Do you have a bike? ( Interrogative sentence)
Do you not have a bike? ( Negative interrogative sentence)
మరి కొన్ని ఉదాహరణలు.
| 1. I have a car. (You do have a car) | నా దగ్గర కారు ఉంది. (నేను కారును కలిగి వున్నాను అను కూడా అనవచ్చు కాను వాడుకలో అలా చెప్పరు) |
| ఐ హ్యవ్ ఎ కార్. | |
| I do not have a car. | నా దగ్గర కారు లేదు. |
| Do I have a car? | నా దగ్గర కారు ఉందా? |
| Do I not have a car? | నాకు కారు లేదా? |
| 2.You have a new phone. | నీ దగ్గర ఒక కొత్త ఫోన్ ఉన్నది. |
| యూ హ్యవ్ ఎ న్యూ ఫోన్. | |
| You do not have a new phone. | నీ దగ్గర ఒక కొత్త ఫోన్ లేదు. |
| Do You have a new phone? | నీ దగ్గర ఒక కొత్త ఫోన్ ఉందా? |
| Do you not have a new phone? | నీ దగ్గర ఒక కొత్త ఫోన్ లేదా? |
| 3.They have a meeting today. | ఈ రోజు వారి కి సమావేశం ఉంది. |
| దే హ్యవ్ ఎ మీటింగ్ టుడే. | |
| They do not have a meeting today. | వారికి ఈరోజు సమావేశం లేదు. |
| Do they have a meeting today? | వారికి ఈరోజు మీటింగ్ ఉందా? |
| Do they not have a meeting today? | వారికి ఈరోజు మీటింగ్ లేదా? |
| 4.We have lunch at noon. | మాకు మధ్యాహ్నం భోజనం ఉంది. |
| వీ హ్యవ్ లంచ్ అట్ నూన్. | |
| We do not have lunch at noon. | మాకు మధ్యాహ్నం భోజనం లేదు. |
| Do we have lunch at noon? | మాకు మధ్యాహ్నం భోజనం ఉందా? |
| Do we not have lunch at noon? | మాకు మధ్యాహ్నం భోజనం లేదా? |
| 5. I have a new pen.
ఐ హ్యవ్ ఎ న్యూ పెన్. |
నా దగ్గర కొత్త పెన్ను ఉంది. (లేదా నేను ఒక కొత్త పెన్నును కలిగి ఉన్నాను) |
| I do not have a new pen. | నా దగ్గర కొత్త పెన్ను లేదు. |
| Do I have a new pen? | నా దగ్గర కొత్త పెన్ను ఉందా? |
| Do I not have a new pen? | నా దగ్గర కొత్త పెన్ను లేదా? |
| 6.We have a science project.
వీ హ్యవ్ ఎ సైన్స్ ప్రాజెక్ట్. |
మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఉన్నది (లేదా మేము ఒక సైన్స్ ప్రాజెక్ట్ ని కలిగి ఉన్నాము) |
| We do not have a science project. | మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ లేదు. |
| Do we have a science project? | మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఉందా? |
| Do we not have a science project? | మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ లేదా? |
| 7. You have a good opportunity.
యూ హ్యవ్ ఎ గుడ్ ఆపర్చ్యునిటీ. |
మీకు మంచి అవకాశం ఉంది. (లేదా మీరు ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉన్నారు) |
| You do not have a good opportunity. | మీకు మంచి అవకాశం లేదు. |
| Do you have a good opportunity? | మీకు మంచి అవకాశం ఉందా? |
| Do you not have a good opportunity? | మీకు మంచి అవకాశం లేదా? |
| 8. They have a large garden.
దే హ్యవ్ ఎ లార్జ్ గార్డెన్. |
వారికి పెద్ద తోట ఉంది. |
| They do not have a large garden. | వారికి పెద్ద తోట లేదు. |
| Do they have a large garden? | వారికి పెద్ద తోట ఉందా? |
| Do they not have a large garden? | వాళ్ళకి పెద్ద తోట లేదా? |
| 9. I have two sisters.
ఐ హ్యవ్ టూ సిస్టర్స్. |
నాకు ఇద్దరు చెల్లెళ్ళు. (లేదా నేను ఇద్దరు చెల్లెళ్లను కలిగి ఉన్నాను) |
| I do not have two sisters. | నాకు ఇద్దరు చెల్లెళ్ళు లేరు. |
| Do I have two sisters? | నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారా? |
| Do I not have two sisters? | నాకు ఇద్దరు చెల్లెళ్ళు లేరా? |
| 10. We have enough chairs.
వీ హ్యవ్ ఇనఫ్ చెయర్స్. |
మాకు సరిపడా కుర్చీలు ఉన్నాయి. (లేదా మేము సరిపడ కుర్చీలను కలిగి ఉన్నాము) |
| We do not have enough chairs. | మాకు సరిపడా కుర్చీలు లేవు. |
| Do we have enough chairs? | మాకు సరిపడా కుర్చీలు ఉన్నాయా? |
| Do we not have enough chairs? | మాకు సరిపడా కుర్చీలు లేవా? |
| 11. You have a smart phone.
యూ హ్యవ్ ఎ స్మార్ట్ ఫోన్. |
మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. (లేదా మీరు ఒక స్మార్ట్ ఫోన్ను కలిగి ఉన్నారు) |
| You do not have a smart phone. | మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. |
| Do you have a smart phone? | మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? |
| Do you not have a smart phone? | మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా? |
| 12. They have three cars.
దే హ్యవ్ త్రీ కార్స్. |
వాళ్ళ దగ్గర మూడు కార్లు ఉన్నాయి.( లేదా వారు మూడు కార్లను కలిగి ఉన్నారు) |
| They do not have three cars. | వాళ్ళ దగ్గర మూడు కార్లు లేవు. |
| Do they have three cars? | వాళ్ళ దగ్గర మూడు కార్లు ఉన్నాయా? |
| Do they not have three cars? | వాళ్ళ దగ్గర మూడు కార్లు లేవా? |
| 13. I have a big dream.
ఐ హ్యవ్ ఎ బిగ్ డ్రీమ్. |
నాకు ఒక పెద్ద కల ఉంది.( లేదా నేను ఒక పెద్ద కలను కలిగి ఉన్నాను) |
| I do not have a big dream. | నాకు ఒక పెద్ద కల లేదు |
| Do I have a big dream? | నాకు పెద్ద కల ఉందా? |
| Do I not have a big dream? | నాకు పెద్ద కల లేదా? |
| 14. We have a history class.
వీ హ్యవ్ ఎ హిస్టరీ క్లాస్. |
మాకు చరిత్ర తరగతి ఉంది. (లేదా మేము ఒక చరిత్ర తరగతిని కలిగి ఉన్నాము) |
| We do not have a history class. | మాకు చరిత్ర తరగతి లేదు. |
| Do we have a history class? | మనకు చరిత్ర తరగతి ఉందా? |
| Do we not have a history class? | మనకు చరిత్ర తరగతి లేదా? |
| 15. You have a kind heart.
యూ హ్యవ్ ఎ కైండ్ హార్ట్. |
మీకు దయగల హృదయం ఉంది. ( లేదా మీరు ఒక దయగల హృదయాన్ని కలిగి ఉన్నారు) |
| You do not have a kind heart. | మీకు దయగల హృదయం లేదు. |
| Do you have a kind heart? | మీకు దయగల హృదయం ఉందా? |
| Do you not have a kind heart? | మీకు దయగల హృదయం లేదా? |
| 16. They have a busy schedule.
దే హ్యవ్ ఎ బిజీ షెడ్యూల్. |
వారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ( లేదా వారు బిజీ షెడ్యూల్ను కలిగి ఉన్నారు) |
| They do not have a busy schedule. | వారికి బిజీ షెడ్యూల్ లేదు. |
| Do they have a busy schedule? | వారికి బిజీ షెడ్యూల్ ఉందా? |
| Do they not have a busy schedule? | వారికి బిజీ షెడ్యూల్ లేదా? |
| 17. I have a small doubt.
ఐ హ్యవ్ ఎ స్మాల్ డౌట్. |
నాకు ఒక చిన్న సందేహం ఉంది. ( లేదా నేను ఒక చిన్న సందేహాన్ని కలిగి ఉన్నాను) |
| I do not have a small doubt. | నాకు చిన్న సందేహం లేదు. |
| Do I have a small doubt? | నాకు ఒక చిన్న సందేహం ఉందా? |
| Do I not have a small doubt? | నాకు ఒక చిన్న సందేహం లేదా? |
| 18. We have a clear plan.
వీ హ్యవ్ ఎ క్లియర్ ప్లాన్. |
మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. (లేదా మేము స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాము) |
| We do not have a clear plan. | మాకు స్పష్టమైన ప్రణాళిక లేదు. |
| Do we have a clear plan? | మాకు స్పష్టమైన ప్రణాళిక ఉందా? |
| Do we not have a clear plan? | మాకు స్పష్టమైన ప్రణాళిక లేదా? |
| 19. You have strong skills.
యూ హ్యవ్ స్ట్రాంగ్ స్కిల్స్. |
మీకు బలమైన నైపుణ్యాలు ఉన్నాయి. ( లేదా మీరు బలమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు) |
| You do not have strong skills. | మీకు బలమైన నైపుణ్యాలు లేవు. |
| Do you have strong skills? | మీకు బలమైన నైపుణ్యాలు ఉన్నాయా? |
| Do you not have strong skills? | మీకు బలమైన నైపుణ్యాలు లేవా? |
| 20. They have a new idea.
దే హ్యవ్ ఎ న్యూ ఐడియా. |
వారికి ఒక కొత్త ఆలోచన ఉంది . ( లేదా వారు ఒక కొత్త ఆలోచనను కలిగి ఉన్నారు) |
| They do not have a new idea. | వారికి కొత్త ఆలోచన లేదు. |
| Do they have a new idea? | వారికి కొత్త ఆలోచన ఉందా? |
| Do they not have a new idea? | వాళ్ళకి కొత్త ఆలోచన లేదా? |
♠♠♠♠♠ End ♠♠♠♠♠♠
Has
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It సబ్జెక్ట్ గా వున్నప్పుడు. Has ఎవిదంగా ఉపయోగిస్తారో తెలుసు కుందాం : (Possessive sentences)
has=కలిగివుండు
Possessive అనగా కలిగి ఉండు అని అర్థం. Ownership అని కూడా అనవచ్చు.
అతనికి రెండు ఇల్లు ఉన్నాయి. (అతను రెండు ఇళ్ళను కలిగి ఉన్నాడు)
అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. (అతను ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడు)
అతనికి ఈ రోజు మీటింగ్ ఉన్నది. (అతను ఈరోజు మీటింగ్ ని కలిగి ఉన్నాడు)
ఈ విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోHe, SHe, It లకు కలిగి వుండు అనే అర్ధాన్ని తెలియజేయడానికి .‘Has’ అనే సహాయక క్రియ ఉపయోగిస్తారు.
| He, She, It + Has + Object |
క్రింది పట్టిక లోని ఉదాహరణలు గమనించండి.
| She has a car. (She does have a car). | ఆమెకి ఒక కారు ఉన్నది. (Has= కలిగి ఉండుట) ఆమెకి ఒక కారు ఉన్నది. అంటే ఆమె ఒక కారు కలిగి ఉన్నది అని అర్థం.
|
| Usha has two houses. (Usha does have two houses). | ఉషాకి రెండు ఇళ్ళు ఉన్నాయి. |
ఆమెకు కారు ఉన్నది, ఉషాకి రెండు ఇల్లు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి నిన్న, నేడు, రేపు కూడా ఉన్నాయి అని అర్థం.
She has a car. ఈ వాక్యాన్ని She does have a car అని కూడా రాయవచ్చు ఎందుకని?
సాధారణంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, she It లకు ‘Does’ అనే సహాయక క్రియ ఉపయోగిస్తామని తెలుసుకున్నాము.పై వాక్యంలో Verb లేకపోయినప్పటికీ Has మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ ఒక సంపూర్ణ వాక్యాన్ని నిర్మించింది. ఇక్కడ Has మెయిన్ వెర్బ్ స్థానంలోకి వెళ్లిపోయింది. గనుక ఈ సెంటెన్స్ లో సహాయక క్రియ లేదు. గ్రామర్ రూల్ ప్రకారం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It లు సబ్జెక్టులు గా ఉన్నప్పుడు ఆ వాక్యం లో సహాయక క్రియ లేకపోతే Does ఉపయోగించుకోవాలి. అప్పుడు She does has a car అని రాయాలి. కానీ ఈ విదంగా రాయడం కూడా తప్పు అవుతుంది.ఎందుకని?
| Do,Does,Did సహాయక్రియలు వాక్యంలో ఉన్నప్పుడు Verbs మొదటి రూపంలోనే ఉండాలి. |
Does అనే సహాయక క్రియ వచ్చినప్పుడు Has దాని మొదటి రూపమైన ‘have’ లోకి వెళ్ళిపోవాలి ?
అప్పుడు She has a car ని She does have a car (P) అని రాయాలి. నెగిటివ్ సెంటెన్స్ రాయటానికి ‘Does’ పక్కన not చేర్చాలి
She does not have a car (N) అవుతుంది.
ఈ రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి Does ని సబ్జెక్టు అయిన ‘She’ కి ముందు ఉంచాలి.
Does she have a car (I)
Does she not have a car (NI)
| Sha has a car అను వాక్యానికి వ్యతిరేక వాక్యాన్ని She has no car అని కూడా చెప్పవచ్చు కానీ ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించడం లేదు |
క్రింది టేబుల్ లో ఉన్న ఉదాహరణలు కూడా గమనించండి
| 1.She has a new car.
(She does have a new car.) |
ఆమెకు కొత్త కారు ఉంది. (ఆమె ఒక కొత్త కారును కలిగి ఉంది) |
| షీ హ్యాస్ ఎ న్యూ కార్. | |
| She does not have a new car. | ఆమెకు కొత్త కారు లేదు. |
| Does she have a new car? | ఆమెకు కొత్త కారు ఉందా? |
| Does she not have a new car? | ఆమెకు కొత్త కారు లేదా? |
| 2.He has a meeting at 10 AM. | ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంది.(ఆయన ఉదయం 10 గంటలకు మీటింగ్ కలిగి వున్నాడు) |
| హీ హ్యాస్ ఎ మీటింగ్ ఎట్ 10 ఏఎమ్. | |
| He does not have a meeting at 10 AM. | ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదు. |
| Does he have a meeting at 10 AM? | అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందా? |
| Does he not have a meeting at 10 AM? | అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదా? |
| 3.The house has a big garden. | ఇంట్లో పెద్ద తోట ఉంది. (ఆ ఇల్లు ఒక పెద్ద తోట కలిగి ఉన్నది) |
| ది హౌస్ హ్యాస్ ఎ బిగ్ గార్డెన్. | |
| The house does not have a big garden. | ఇంట్లో పెద్ద గార్డెన్ లేదు. |
| Does the house have a big garden? | ఇంట్లో పెద్ద తోట ఉందా? |
| Does the house not have a big garden? | ఇంట్లో పెద్ద తోట లేదా? |
| 4.My friend has a dog. | నా స్నేహితుడికి ఒక కుక్క ఉంది.(నా స్నేహితుదు ఒక కుక్కను కలిగి వున్నాడు) |
| మై ఫ్రెండ్ హ్యాస్ ఎ డాగ్. | |
| My friend does not have a dog. | నా స్నేహితుడికి కుక్క లేదు. |
| Does my friend have a dog? | నా స్నేహితుడికి కుక్క ఉందా? |
| Does my friend not have a dog? | నా స్నేహితుడికి కుక్క లేదా? |
| 5.The book has a blue cover. | పుస్తకానికి నీలం రంగు కవర్ ఉంది.(పుస్తకం నీలం రంగు కవర్ కలిగి ఉంది) |
| ది బుక్ హ్యాస్ ఎ బ్లూ కవర్. | |
| The book does not have a blue cover. | పుస్తకానికి నీలి రంగు కవర్ లేదు. |
| Does the book have a blue cover? | పుస్తకానికి నీలి రంగు కవర్ ఉందా? |
| Does the book not have a blue cover? | పుస్తకానికి నీలి రంగు కవర్ లేదా? |
| 6. He has a bike. | అతనికి ఒక బైకు ఉంది ( లేదా అతను ఒక బైక్ ని కలిగి ఉన్నాడు) |
| హీ హ్యాస్ ఎ బైక్. | |
| He does not have a bike. | అతనికి బైక్ లేదు. |
| Does he have a bike? | అతనికి బైక్ ఉందా? |
| Does he not have a bike? | అతనికి బైక్ లేదా? |
| 7. He has a small family. | అతనికి చిన్న కుటుంబం ఉంది.( లేదా అతను ఒక చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నాడు ) |
| హీ హ్యాస్ ఎ స్మాల్ ఫ్యామిలీ. | |
| He does not have a small family. | అతనికి చిన్న కుటుంబం లేదు. |
| Does he have a small family? | అతనికి చిన్న కుటుంబం ఉందా? |
| Does he not have a small family? | అతనికి చిన్న కుటుంబం లేదా? |
| 8. He has a good job. | అతనికి మంచి ఉద్యోగం ఉంది.(లేదా అతను ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు) |
| హీ హ్యాస్ ఎ గుడ్ జాబ్. | |
| He does not have a good job. | అతనికి మంచి ఉద్యోగం లేదు. |
| Does he have a good job? | అతనికి మంచి ఉద్యోగం ఉందా? |
| Does he not have a good job? | అతనికి మంచి ఉద్యోగం లేదా? |
| 9. She has a blue bag. | ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ ఉంది. (ఆమె ఒక నీలి రంగు బ్యాగును కలిగి ఉంది) |
| షీ హ్యాస్ ఎ బ్లూ బ్యాగ్. | |
| She does not have a blue bag. | ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ లేదు. |
| Does she have a blue bag? | ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ ఉందా? |
| Does she not have a blue bag? | ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ లేదా? |
| 10. She has a kind heart. | ఆమెకు దయగల హృదయం ఉంది. (ఆమె ఒక దయగల హృదయాన్ని కలిగి ఉంది) |
| షీ హ్యాస్ ఎ కైండ్ హార్ట్. | |
| She does not have a kind heart. | ఆమెకు దయగల హృదయం లేదు. |
| Does she have a kind heart? | ఆమెకు దయగల హృదయం ఉందా? |
| Does she not have a kind heart? | ఆమెకు దయగల హృదయం లేదా? |
| 11. She has a new phone. | ఆమెకు కొత్త ఫోన్ ఉంది. ( ఆమె ఒక కొత్త ఫోన్ కలిగి ఉంది) |
| షీ హ్యాస్ ఎ న్యూ ఫోన్. | |
| She does not have a new phone. | ఆమె దగ్గర కొత్త ఫోన్ లేదు. |
| Does she have a new phone? | ఆమె దగ్గర కొత్త ఫోన్ ఉందా? |
| Does she not have a new phone? | ఆమె దగ్గర కొత్త ఫోన్ లేదా? |
| 12. It has four legs. | దీనికి నాలుగు కాళ్ళు ఉన్నాయి.( ఇది నాలుగు కాళ్ళను కలిగి ఉంది) |
| ఇట్ హ్యాస్ ఫోర్ లెగ్స్. | |
| It does not have four legs. | దానికి నాలుగు కాళ్ళు లేవు. |
| Does it have four legs? | దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయా? |
| Does it not have four legs? | దానికి నాలుగు కాళ్ళు లేవా? |
| 13. It has a long tail. | దీనికి పొడవాటి తోక ఉంటుంది.( ఇది ఒక పొడవాటి తోకను కలిగి ఉంది) |
| ఇట్ హ్యాస్ ఎ లాంగ్ టెయిల్. | |
| It does not have a long tail. | దానికి పొడవైన తోక లేదు. |
| Does it have a long tail? | దానికి పొడవైన తోక ఉందా? |
| Does it not have a long tail? | దానికి పొడవైన తోక లేదా? |
| 14. It has a red color. | దీనికి ఎరుపు రంగు ఉంటుంది. (ఇది ఒక ఎరుపు రంగును కలిగి ఉంది) |
| ఇట్ హ్యాస్ ఎ రెడ్ కలర్. | |
| It does not have a red color. | దీనికి ఎరుపు రంగు ఉండదు. |
| Does it have a red color? | దానికి ఎరుపు రంగు ఉందా? |
| Does it not have a red color? | దానికి ఎరుపు రంగు లేదా? |
| 15. It has a small window. | దీనికి ఒక చిన్న కిటికీ ఉంది.( ఇది ఒక చిన్న కిటికీ ని కలిగి ఉంది) |
| ఇట్ హ్యాస్ ఎ స్మాల్ విండో. | |
| It does not have a small window. | దానికి చిన్న కిటికీ లేదు. |
| Does it have a small window? | దానికి చిన్న కిటికీ ఉందా? |
| Does it not have a small window? | దానికి చిన్న కిటికీ లేదా? |
♠♠♠♠♠ End ♠♠♠♠♠♠
