Past perfect tense
Main Meaning:
1.ఇప్పుడే జరిగిపోయిన పనులను Present Perfect Tense లో తెలియజేస్తారు
2.సాధారణంగా గతంలో ఒక నిర్దిష్టమైన సమయంలో జరిగిపోయిన పనులను Simple Past టెన్స్ లో తెలియజేస్తారు.
3. కానీ, గతంలో రెండు పనులు జరిగిపోయి ఉంటాయి. వాటిలో ముందుగా జరిగిన పనిని Past Perfect tense లోను తరువాత జరిగిన పనిని Simple Past లో తెలియజేస్తారు. ఇటువంటి సందర్భంలో మాత్రమే ఈ Past Perfect tense ని ఉపయోగిస్తారు.
Singular sunject లకు మరియు Plural subject లకు అన్నిటికీ కలిపి ‘Had’ సహాయక క్రియ ఉపయోగిస్తారు. Past perfect tense లో verb ఎల్లప్పుడు మూడవ రూపంలోనే (V3) ఉండాలి.
| He, She, It, I, We, You, They | Had | V3 | Object |
I had, We had, You had, He had, She had, It had, They had
గతంలో రెండు పనులు జరిగినప్పుడు, వాటిలో ఏ పని ముందుగా జరిగిందో స్పష్టంగా తెలియజేయడానికి Past Perfect Tense ఉపయోగిస్తాం.
ముందుగా జరిగిన పని Past Perfect
తరువాత జరిగిన పని Simple Past లో తెలియజేస్తారు
Examples
The train had left before we reached the station.
మేము స్టేషన్‌కు చేరుకునేలోపే రైలు వెళ్లిపోయింది.
ఇందులో:
రైలు వెళ్లిపోవడం ముందుగా జరిగింది → had left
మేము స్టేషన్‌కు చేరుకోవడం తరువాత జరిగింది → reached
Sentence Structure
Subject + had + V3 + before + Subject + V2
లేదా:
After + Subject + had + V3, Subject + V2
Before ఉపయోగించినప్పుడు
Before తరువాత సాధారణంగా తరువాత జరిగిన పని వస్తుంది.
She had cooked dinner before her husband came home.
After ఉపయోగించినప్పుడు
After తరువాత ముందుగా జరిగిన పనిని చెప్పవచ్చు.
After she had cooked dinner, her husband came home.
ఈ రెండు వాక్యాల అర్థం ఒకటే. కేవలం వాక్య నిర్మాణం మారింది.
నెగిటివ్ సెంటెన్స్ రాయటానికి Had పక్కన Not చేరిస్తే సరిపోతుంది.
Interrogative , negative interrogative sentences ముందు Had పెడితే సరిపోతుంది
Examples:
ఒకవేళ మీరు క్రింద table లో ఉన్న సెంటెన్సెస్ ని after ఉపయోగించి చెప్పాలనుకుంటే
సెంటెన్స్ ప్రారంభంలోనే after ఉంచి before ప్లేస్ లో కామా ఉంచితే సరిపోతుంది. నేను మొదటి త్రీ సెంటెన్స్ లాగా రాస్తాను.
| 1. After the train had left, we reached the station. | 1. రైలు వెళ్ళిపోయిన తర్వాత మేము స్టేషన్‌కు చేరుకున్నాము. |
| 2. After she had cooked dinner, her husband came home. | 2. ఆమె రాత్రి భోజనం వండిన తర్వాత, ఆమె భర్త ఇంటికి వచ్చారు. |
| 3. After I had finished my homework, my friend called me. | 3. నేను నా ఇంటి పని పూర్తి చేసిన తర్వాత, నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. |
| 1.The train had left before we reached the station.
ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. |
మేము స్టేషన్‌కు చేరుకునేలోపే రైలు వెళ్లిపోయింది. |
| 2. She had cooked dinner before her husband came home.
షీ హ్యాడ్ కుక్డ్ డిన్నర్ బిఫోర్ హర్ హజ్బండ్ కేమ్ హోమ్. |
ఆమె భర్త ఇంటికి రాకముందే ఆమె భోజనం వండింది. |
| 3. I had finished my homework before my friend called me.
ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోమ్‌వర్క్ బిఫోర్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. |
నా స్నేహితుడు నాకు ఫోన్ చేయకముందే నేను హోంవర్క్ పూర్తి చేశాను. |
| 4. They had eaten breakfast before they went to school.
దే హ్యాడ్ ఈటెన్ బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ దే వెంట్ టు స్కూల్. |
వారు పాఠశాలకు వెళ్లకముందే అల్పాహారం తిన్నారు. |
| 5. He had locked the door before he left the house.
హీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ బిఫోర్ హీ లెఫ్ట్ ద హౌస్. |
అతను ఇంటి నుంచి బయలుదేరకముందే తలుపుకు తాళం వేశాడు. |
| 6. The movie had started before we entered the theatre.
ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ వి ఎంటర్డ్ ద థియేటర్. |
మేము థియేటర్లోకి ప్రవేశించకముందే సినిమా ప్రారంభమైంది. |
| 7. The children had slept before their father returned home.
ద చిల్డ్రన్ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ దేర్ ఫాదర్ రిటర్న్డ్ హోమ్. |
వారి తండ్రి ఇంటికి తిరిగి రాకముందే పిల్లలు నిద్రపోయారు. |
| 8. She had cleaned the room before the guests arrived.
షీ హ్యాడ్ క్లీన్డ్ ద రూమ్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. |
అతిథులు రాకముందే ఆమె గదిని శుభ్రం చేసింది. |
| 9. We had bought the tickets before the bus arrived.
వి హ్యాడ్ బాట్ ద టికెట్స్ బిఫోర్ ద బస్ అరైవ్డ్. |
బస్సు రాకముందే మేము టికెట్లు కొన్నాము. |
| 10. The rain had stopped before we went outside.
ద రైన్ హ్యాడ్ స్టాప్ట్ బిఫోర్ వి వెంట్ అవుట్‌సైడ్. |
మేము బయటకు వెళ్లకముందే వర్షం ఆగిపోయింది. |
| 11. He had completed the work before the manager arrived.
హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ ద మేనేజర్ అరైవ్డ్. |
మేనేజర్ రాకముందే అతను పనిని పూర్తి చేశాడు. |
| 12. My mother had prepared tea before the visitors came.
మై మదర్ హ్యాడ్ ప్రిపేర్డ్ టీ బిఫోర్ ద విజిటర్స్ కేమ్. |
సందర్శకులు రాకముందే మా అమ్మ టీ తయారుచేసింది. |
| 13. The teacher had entered the classroom before the bell rang.
ద టీచర్ హ్యాడ్ ఎంటర్డ్ ద క్లాస్రూమ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. |
గంట మోగకముందే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించారు. |
| 14. Ravi had saved some money before he bought a bicycle.
రవి హ్యాడ్ సేవ్డ్ సమ్ మనీ బిఫోర్ హీ బాట్ ఎ బైసికల్. |
రవి సైకిల్ కొనకముందే కొంత డబ్బు పొదుపు చేశాడు. |
| 15. After she had written the letter, she posted it.
ఆఫ్టర్ షీ హ్యాడ్ రిటన్ ద లెటర్, షీ పోస్టెడ్ ఇట్. |
ఆమె ఉత్తరం రాసిన తరువాత దానిని పోస్ట్ చేసింది. |
| 16. They had reached the airport before the flight departed.
దే హ్యాడ్ రీచ్డ్ ది ఎయిర్పోర్ట్ బిఫోర్ ద ఫ్లైట్ డిపార్టెడ్. |
విమానం బయలుదేరకముందే వారు విమానాశ్రయానికి చేరుకున్నారు. |
| They had not reached the airport before the flight departed. | విమానం బయలుదేరకముందు వారు విమానాశ్రయానికి చేరుకోలేదు. |
| Had they reached the airport before the flight departed? | విమానం బయలుదేరకముందే వారు విమానాశ్రయానికి చేరుకున్నారా? |
| Hadn’t they reached the airport before the flight departed? | విమానం బయలుదేరకముందే వారు విమానాశ్రయానికి చేరుకోలేదా? |
| 17. She had finished the work before the manager arrived.
షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ ద మేనేజర్ అరైవ్డ్. |
మేనేజర్ రాకముందే ఆమె పనిని పూర్తి చేసింది. |
| She had not finished the work before the manager arrived. | మేనేజర్ రాకముందు ఆమె పనిని పూర్తి చేయలేదు. |
| Had she finished the work before the manager arrived? | మేనేజర్ రాకముందే ఆమె పనిని పూర్తి చేసిందా? |
| Hadn’t she finished the work before the manager arrived? | మేనేజర్ రాకముందే ఆమె పనిని పూర్తి చేయలేదా? |
| 18. He had left the office before you called him.
హీ హ్యాడ్ లెఫ్ట్ ది ఆఫీస్ బిఫోర్ యూ కాల్డ్ హిమ్. |
నువ్వు అతనికి ఫోన్ చేయకముందే అతను ఆఫీసు నుంచి వెళ్లిపోయాడు. |
| He had not left the office before you called him. | నువ్వు అతనికి ఫోన్ చేయకముందు అతను ఆఫీసు నుంచి వెళ్లలేదు. |
| Had he left the office before you called him? | నువ్వు అతనికి ఫోన్ చేయకముందే అతను ఆఫీసు నుంచి వెళ్లిపోయాడా? |
| Hadn’t he left the office before you called him? | నువ్వు అతనికి ఫోన్ చేయకముందే అతను ఆఫీసు నుంచి వెళ్లిపోలేదా? |
| 19. They had eaten dinner before they went to bed.
దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ దే వెంట్ టు బెడ్. |
వారు పడుకోవడానికి వెళ్లకముందే భోజనం చేశారు. |
| They had not eaten dinner before they went to bed. | వారు పడుకోవడానికి వెళ్లకముందు భోజనం చేయలేదు. |
| Had they eaten dinner before they went to bed? | వారు పడుకోవడానికి వెళ్లకముందే భోజనం చేశారా? |
| Hadn’t they eaten dinner before they went to bed? | వారు పడుకోవడానికి వెళ్లకముందే భోజనం చేయలేదా? |
| 20. After I had completed the course, I applied for a job.
ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద కోర్స్, ఐ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. |
నేను కోర్సు పూర్తి చేసిన తరువాత ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. |
| I had not completed the course before I applied for a job. | నేను ఉద్యోగానికి దరఖాస్తు చేయకముందు కోర్సును పూర్తి చేయలేదు. |
| Had I completed the course before I applied for a job? | నేను ఉద్యోగానికి దరఖాస్తు చేయకముందే కోర్సును పూర్తి చేశానా? |
| Hadn’t I completed the course before I applied for a job? | నేను ఉద్యోగానికి దరఖాస్తు చేయకముందే కోర్సును పూర్తి చేయలేదా? |