IN / ON / AT — Place Prepositions
ఒక వ్యక్తి లేదా వస్తువు ఎక్కడ ఉంది? అనే విషయాన్ని చెప్పడానికి in, on, at place prepositions ఉపయోగిస్తాం.
సులభంగా గుర్తుంచుకోండి:
- IN → లోపల
- ON → ఉపరితలంపై
- AT → ఒక నిర్దిష్టమైన ప్రదేశం లేదా పాయింట్ వద్ద
1. IN — లోపల
ఒక వ్యక్తి లేదా వస్తువు ఏదైనా ప్రదేశం, గది, భవనం, పెట్టె లేదా ప్రాంతం లోపల ఉన్నప్పుడు in ఉపయోగిస్తాం.
గది లేదా భవనం లోపల
- in the room — గదిలో
- in the kitchen — వంటగదిలో
- in the house — ఇంట్లో
- in the shop — దుకాణంలో
- in the hospital — ఆసుపత్రిలో
Examples:
- She is in the room.
ఆమె గదిలో ఉంది. - My mother is in the kitchen.
మా అమ్మ వంటగదిలో ఉంది. - There are many people in the shop.
దుకాణంలో చాలామంది ఉన్నారు.
వస్తువు లోపల
- in the box — పెట్టెలో
- in the bag — సంచిలో
- in the bottle — సీసాలో
- in the cupboard — అలమారలో
- in my pocket — నా జేబులో
Examples:
- The books are in the bag.
పుస్తకాలు సంచిలో ఉన్నాయి. - There is some water in the bottle.
సీసాలో కొంత నీరు ఉంది. - My phone is in my pocket.
నా ఫోన్ నా జేబులో ఉంది.
పట్టణాలు, రాష్ట్రాలు మరియు దేశాలు
పెద్ద భౌగోళిక ప్రాంతాల ముందు సాధారణంగా in ఉపయోగిస్తాం.
- in Kavali
- in Andhra Pradesh
- in India
- in Asia
- in the world
Examples:
- I live in India.
నేను భారతదేశంలో నివసిస్తున్నాను. - She works in Hyderabad.
ఆమె హైదరాబాద్‌లో పనిచేస్తుంది. - They live in Andhra Pradesh.
వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారు.
నీటిలో లేదా ద్రవంలో
- in the water — నీటిలో
- in the sea — సముద్రంలో
- in the river — నదిలో
- in the milk — పాలలో
Examples:
- The children are swimming in the water.
పిల్లలు నీటిలో ఈదుతున్నారు. - There are many fish in the sea.
సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి.
వాహనం లోపల
చిన్న వ్యక్తిగత వాహనాల ముందు సాధారణంగా in ఉపయోగిస్తాం.
- in a car
- in a taxi
- in an auto
- in a van
Examples:
- She is sitting in the car.
ఆమె కారులో కూర్చొని ఉంది. - We are travelling in a taxi.
మేము టాక్సీలో ప్రయాణిస్తున్నాము.
2. ON — ఉపరితలంపై
ఒక వస్తువు మరొక వస్తువు యొక్క ఉపరితలాన్ని తాకుతూ ఉన్నప్పుడు on ఉపయోగిస్తాం.
వస్తువు మీద
- on the table — బల్ల మీద
- on the chair — కుర్చీ మీద
- on the floor — నేల మీద
- on the bed — మంచం మీద
- on the shelf — షెల్ఫ్ మీద
- on the wall — గోడ మీద
Examples:
- The book is on the table.
పుస్తకం బల్ల మీద ఉంది. - Your clothes are on the bed.
నీ బట్టలు మంచం మీద ఉన్నాయి. - There is a picture on the wall.
గోడ మీద ఒక చిత్రం ఉంది. - The children are sitting on the floor.
పిల్లలు నేల మీద కూర్చున్నారు.
రోడ్డు లేదా వీధిలో
- on this road — ఈ రోడ్డులో
- on Park Street — పార్క్ స్ట్రీట్‌లో
- on the main road — ప్రధాన రోడ్డులో
Examples:
- The bank is on the main road.
బ్యాంకు ప్రధాన రోడ్డులో ఉంది. - He lives on Park Street.
అతను పార్క్ స్ట్రీట్‌లో నివసిస్తున్నాడు.
అంతస్తుల ముందు
- on the first floor
- on the second floor
- on the top floor
Examples:
- My office is on the second floor.
నా ఆఫీస్ రెండవ అంతస్తులో ఉంది. - They live on the top floor.
వాళ్లు పై అంతస్తులో నివసిస్తున్నారు.
ఎడమవైపు లేదా కుడివైపు
- on the left
- on the right
Examples:
- The bank is on the left.
బ్యాంకు ఎడమవైపు ఉంది. - The hospital is on the right.
ఆసుపత్రి కుడివైపు ఉంది.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్
బస్సు, రైలు, విమానం, ఓడ వంటి పెద్ద వాహనాలతో సాధారణంగా on ఉపయోగిస్తాం.
- on the bus
- on the train
- on the plane
- on the ship
Examples:
- She is on the bus.
ఆమె బస్సులో ఉంది. - We met on the train.
మేము రైలులో కలుసుకున్నాము. - There are 150 passengers on the plane.
విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
కొన్ని ద్విచక్ర వాహనాలు
- on a bicycle
- on a bike
- on a motorcycle
- on a horse
Examples:
- He is on a bicycle.
అతను సైకిల్ మీద ఉన్నాడు. - She came on a bike.
ఆమె బైక్ మీద వచ్చింది.
3. AT — నిర్దిష్టమైన ప్రదేశం వద్ద
ఒక ప్రదేశాన్ని దాని లోపలి భాగంగా కాకుండా, ఒక నిర్దిష్టమైన point లేదా locationగా చెప్పినప్పుడు at ఉపయోగిస్తాం.
నిర్దిష్టమైన ప్రదేశం వద్ద
- at the bus stop — బస్‌స్టాప్ వద్ద
- at the railway station — రైల్వే స్టేషన్ వద్ద
- at the door — తలుపు దగ్గర
- at the gate — గేటు వద్ద
- at the traffic lights — ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద
Examples:
- I am waiting at the bus stop.
నేను బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్నాను. - She is standing at the door.
ఆమె తలుపు దగ్గర నిలబడి ఉంది. - Meet me at the railway station.
నన్ను రైల్వే స్టేషన్ వద్ద కలవండి.
కార్యకలాపం జరిగే ప్రదేశం
కొన్ని ప్రదేశాలను వాటిలో జరిగే కార్యక్రమం ఆధారంగా చెప్పినప్పుడు at ఉపయోగిస్తాం.
- at school — పాఠశాలలో
- at college — కళాశాలలో
- at work — పని దగ్గర
- at home — ఇంటి దగ్గర/ఇంట్లో
- at the office — ఆఫీస్‌లో
- at church — చర్చిలో
- at a party — పార్టీలో
- at a meeting — సమావేశంలో
Examples:
- The children are at school.
పిల్లలు పాఠశాలలో ఉన్నారు. - My father is at work.
మా నాన్న పని దగ్గర ఉన్నారు. - She is at home.
ఆమె ఇంట్లో ఉంది. - We met at a party.
మేము ఒక పార్టీలో కలుసుకున్నాము.
At home అనాలి.
సాధారణంగా in home అనకూడదు.
ఖచ్చితమైన చిరునామా ముందు
పూర్తి ఇంటి నంబర్‌తో కూడిన చిరునామా ముందు at ఉపయోగిస్తాం.
- at 25 King Street
- at 10 Gandhi Road
Example:
- He lives at 25 King Street.
అతను 25 కింగ్ స్ట్రీట్ అనే చిరునామాలో నివసిస్తున్నాడు.
కార్యక్రమం లేదా event వద్ద
- at a wedding
- at a concert
- at a conference
- at a function
Examples:
- I saw him at the wedding.
నేను అతనిని పెళ్లిలో చూశాను. - We met at a conference.
మేము ఒక సమావేశంలో కలుసుకున్నాము.
IN మరియు AT మధ్య తేడా
ఒకే ప్రదేశంతో in మరియు at ఉపయోగించవచ్చు. కానీ అర్థంలో చిన్న తేడా ఉంటుంది.
At the hospital
ఆ వ్యక్తి ఆసుపత్రి అనే ప్రదేశం వద్ద లేదా ఆసుపత్రిలో ఏదైనా పని కోసం ఉన్నాడని సూచిస్తుంది.
- Ravi is at the hospital.
రవి ఆసుపత్రి వద్ద లేదా ఆసుపత్రిలో ఉన్నాడు.
In the hospital
ఆ వ్యక్తి ఆసుపత్రి భవనం లోపల ఉన్నాడని స్పష్టంగా చెబుతుంది.
- Ravi is in the hospital.
రవి ఆసుపత్రి లోపల ఉన్నాడు.
మరొక ఉదాహరణ:
- My son is at school.
నా కుమారుడు పాఠశాలలో చదువుకోవడానికి ఉన్నాడు. - My son is in the school.
నా కుమారుడు పాఠశాల భవనం లోపల ఉన్నాడు.
IN మరియు ON — వాహనాల మధ్య తేడా
చిన్న వాహనాలు — IN
- in a car
- in a taxi
- in an auto
Examples:
- I am in the car.
- She is in a taxi.
పెద్ద లేదా ఎక్కి ప్రయాణించే వాహనాలు — ON
- on a bus
- on a train
- on a plane
- on a ship
- on a bicycle
- on a bike
Examples:
- I am on the bus.
- She is on the train.
- He is on a bike.
Address విషయంలో తేడా
- at + పూర్తి చిరునామా
- on + వీధి పేరు
- in + నగరం, రాష్ట్రం లేదా దేశం
Examples:
- He lives at 25 Gandhi Road.
- He lives on Gandhi Road.
- He lives in Hyderabad.
- He lives in Telangana.
- He lives in India.
ఒకే వాక్యంలో IN, ON, AT
- There is a shop at 25 Gandhi Road, on Gandhi Road, in Hyderabad.
ఇందులో:
- at 25 Gandhi Road → ఖచ్చితమైన చిరునామా
- on Gandhi Road → వీధి
- in Hyderabad → నగరం
ముఖ్యమైన Fixed Expressions
ఈ expressionsను అలాగే గుర్తుంచుకోవాలి:
- at home
- at work
- at school
- at college
- at the door
- at the bus stop
- at the station
- in bed
- in prison
- in hospital — British English
- on the left
- on the right
- on the ground floor
- on the way
Examples:
- He is in bed.
అతను మంచంలో ఉన్నాడు. - I met her on the way.
నేను ఆమెను దారిలో కలిశాను. - The shop is on the left.
దుకాణం ఎడమవైపు ఉంది.
TABLE
| 1. He is on a bicycle. | అతను సైకిల్ మీద ఉన్నాడు. |
| 2. She is standing at the door. | ఆమె తలుపు దగ్గర నిలబడి ఉంది. |
| 3. We saw them at a concert. | మేము వారిని ఒక సంగీత కార్యక్రమంలో చూశాము. |
| 4. We met at a conference. | మేము ఒక సమావేశంలో కలుసుకున్నాము. |
| 5. We met at a party. | మేము ఒక పార్టీలో కలుసుకున్నాము. |
| 6. There are flowers in the garden. | తోటలో పూలు ఉన్నాయి. |
| 7. He lives at 25 King Street. | అతను 25 కింగ్ స్ట్రీట్ అనే చిరునామాలో నివసిస్తున్నాడు. |
| 8. She is in the room. | ఆమె గదిలో ఉంది. |
| 9. The children are at school. | పిల్లలు పాఠశాలలో ఉన్నారు. |
| 10. My phone is in my pocket. | నా ఫోన్ నా జేబులో ఉంది. |
| 11. We are travelling in a taxi. | మేము టాక్సీలో ప్రయాణిస్తున్నాము. |
| 12. There is a spoon in the glass. | గ్లాసులో ఒక చెంచా ఉంది. |
| 13. The hospital is on the right. | ఆసుపత్రి కుడివైపు ఉంది. |
| 14. She works in Hyderabad. | ఆమె హైదరాబాద్‌లో పనిచేస్తుంది. |
| 15. Meet me at the railway station. | నన్ను రైల్వే స్టేషన్ వద్ద కలవండి. |
| 16. I am waiting at the bus stop. | నేను బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్నాను. |
| 17. The nurse is in the hospital. | నర్సు ఆసుపత్రి భవనం లోపల ఉంది. |
| 18. I saw him at the wedding. | నేను అతనిని పెళ్లిలో చూశాను. |
| 19. The children are swimming in the water. | పిల్లలు నీటిలో ఈదుతున్నారు. |
| 20. There are many fish in the sea. | సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి. |
| 21. They live on the top floor. | వాళ్లు పై అంతస్తులో నివసిస్తున్నారు. |
| 22. Your clothes are on the bed. | నీ బట్టలు మంచం మీద ఉన్నాయి. |
| 23. My brother lives in Kavali. | మా అన్నయ్య కావలిలో నివసిస్తున్నాడు. |
| 24. I live in India. | నేను భారతదేశంలో నివసిస్తున్నాను. |
| 25. Please wait for me at the station. | దయచేసి స్టేషన్ వద్ద నా కోసం వేచి ఉండండి. |
| 26. I met her on the way. | నేను ఆమెను దారిలో కలిశాను. |
| 27. The manager is at the office. | మేనేజర్ ఆఫీసులో ఉన్నారు. |
| 28. There are 150 passengers on the plane. | విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. |
| 29. The books are in the bag. | పుస్తకాలు సంచిలో ఉన్నాయి. |
| 30. The clock is on the wall. | గడియారం గోడ మీద ఉంది. |
| 31. My sister is at college. | మా అక్క కళాశాలలో ఉంది. |
| 32. There is a picture on the wall. | గోడ మీద ఒక చిత్రం ఉంది. |
| 33. She is sitting in the car. | ఆమె కారులో కూర్చొని ఉంది. |
| 34. She is on the bus. | ఆమె బస్సులో ఉంది. |
| 35. The book is on the table. | పుస్తకం బల్ల మీద ఉంది. |
| 36. They are at church. | వాళ్లు చర్చిలో ఉన్నారు. |
| 37. My office is on the second floor. | నా ఆఫీస్ రెండవ అంతస్తులో ఉంది. |
| 38. He lives on Park Street. | అతను పార్క్ స్ట్రీట్‌లో నివసిస్తున్నాడు. |
| 39. She is at a meeting. | ఆమె ఒక సమావేశంలో ఉంది. |
| 40. He is waiting at the gate. | అతను గేటు వద్ద వేచి ఉన్నాడు. |
| 41. He is in bed. | అతను మంచంలో ఉన్నాడు. |
| 42. My mother is in the kitchen. | మా అమ్మ వంటగదిలో ఉంది. |
| 43. The children are sitting on the floor. | పిల్లలు నేల మీద కూర్చున్నారు. |
| 44. The cups are in the cupboard. | కప్పులు అలమారలో ఉన్నాయి. |
| 45. She is at home. | ఆమె ఇంట్లో ఉంది. |
| 46. We met on the train. | మేము రైలులో కలుసుకున్నాము. |
| 47. My phone is on the chair. | నా ఫోన్ కుర్చీ మీద ఉంది. |
| 48. The car stopped at the traffic lights. | కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. |
| 49. The bank is on the left. | బ్యాంకు ఎడమవైపు ఉంది. |
| 50. There are many people in the shop. | దుకాణంలో చాలామంది ఉన్నారు. |
| 51. She came on a bike. | ఆమె బైక్ మీద వచ్చింది. |
| 52. There is some water in the bottle. | సీసాలో కొంత నీరు ఉంది. |
| 53. My father is at work. | మా నాన్న పని దగ్గర ఉన్నారు. |
| 54. He lives at 10 Gandhi Road. | అతను 10 గాంధీ రోడ్ అనే చిరునామాలో నివసిస్తున్నాడు. |
| 55. The teacher is standing at the board. | టీచర్ బోర్డు దగ్గర నిలబడి ఉన్నారు. |
| 56. My keys are in the box. | నా తాళాలు పెట్టెలో ఉన్నాయి. |
| 57. They live in Andhra Pradesh. | వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారు. |
| 58. The plates are on the shelf. | ప్లేట్లు షెల్ఫ్ మీద ఉన్నాయి. |
| 59. The shop is on the ground floor. | దుకాణం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. |
| 60. The bank is on the main road. | బ్యాంకు ప్రధాన రోడ్డుపై ఉంది. |