TENSES INTRODUCTION

TENSES INTRODUCTION

Introduction     

Tenses’  అనే పదం లాటిన్ పదమైనా ‘Tempus’ నుండి వచ్చింది. టెంపస్ అనగా కాలము అని అర్థం. కానీ భాషా శాస్త్రంలో  Tenses అనేది పని యొక్క కాలాన్ని సూచించేదిగా ఉన్నది. కాలక్రమంలో లాటిన్ పదమైన Tempus, ఫ్రెంచ్ భాషలో ‘Tenses’ అనే ఆంగ్లపదంగా పరిణమించింది.ఒక పని వర్తమాన కాలమును సంబందించినదా, భూతకాలమునకు సంబంధించినదా, లేదా భవిష్యత్తు కాలమునకు సంబంధించినద అని తెలియజేసే వాటిని Tenses అంటారు.ఇంగ్లీష్ భాషలో 80% వరకు కేవలం టెన్స్ మీదనే మాట్లాడుతారు. ఇందులో కేవలం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ 40%,  మిగిలిన Tenses  అన్నీ కలిపి 40% ఉంటాయి. కాబట్టి టెన్సెస్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటే 80% ఇంగ్లీష్  మనం నేర్చుకున్నట్లే.

Tenses రకాలు

Tenses ప్రధానంగా మూడు రకాలు అవి

1)  Present tense (వర్తమాన కాలం)

2)  Past tense  (భూతకాలం)

3)  Future tense (భవిష్యత్ కాలం)

వీటిని మరలా ఒక్కొక్క దానిని Simple, continuous, perfect, perfect continuous అని నాలుగు రకాలుగా విభజిస్తారు. అప్పుడు మొత్తం టెన్సెస్ 12 అవుతాయి.  క్రింది చార్ట్ ని గమనించండి.

1.Simple Present

2.Present Continuous

3.Present Perfect

4.Present Perfect Continuous

5.Simple Past

6.Past Continuous

7.Past Perfect

8.Past Perfect Continuous

9.Simple Future

10.Future Continuous

11.Future Perfect

12.Future Perfect Continuous

 

Letters (అక్షరాలు):  A,B,C,D,E,F,G,H,I,J….. వీటిని letters  అంటారు

Words( పదాలు): Book, Apple, Eat, Read ఈ విధంగా కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడతాయి

Sentences (వాక్యాలు): 1. I eat rice. 2.  You play cricket. 3.He reads a book  4. She drinks milk. ఈ విధంగా కొన్ని పదాలు కలిస్తే వాక్యాలు ఏర్పడతాయి.

 

ఒక వాక్యంలో  ప్రదానంగా మూడు భాగాలు ఉంటాయి.  అవి:

1.Subject (కర్త ) 2.verb (క్రియ లేదా పని ) 3.Object (కర్మ)

Subject: వాక్యంలో పనిచేస్తున్న వ్యక్తిని సబ్జెక్టు అని అంటారు.

verb:  వాక్యంలో సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడో దానినే  verb అంటారు.

Object: సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతున్న దానినే  ఆబ్జెక్ట్ అంటారు.

క్రింద మూడు ఉదాహరణలు ఇచ్చినాము, వీటిని కొంచెం  జాగ్రత్తగా చదవండి.

Example 1:

Ravi eats Mango =రవి మామిడిపండును తింటాడు

పై వాక్యం లో 

Subject ( Ravi) “రవి మామిడిపండును తింటున్నాడు అనగా ఇక్కడ రవి పని చేస్తున్నాడు, కాబట్టి సబ్జెక్టు అవుతాడు”

Verb  ( Eats) రవి ఇక్కడ ఏమి పని చేస్తున్నాడు, తింటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ “తినడం” verb  అవుతుంది.  

Object  (Mango) “మామిడిపండు రవి యొక్క ప్రభావానికి గురి అవుతూ ఉంది, కాబట్టి ఇక్కడ Mango ఆబ్జెక్ట్ అవుతుంది.”

Example 2:

The boy kicks the ball. “ పిల్లవాడు బంతిని తన్నుతాడు”

Subject  (The Boy). “పిల్ల వాడు బంతిని తన్నుతున్నాడు అనగా పిల్లవాడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సబ్జెక్టు అవుతాడు.”

Verb  (Kicks). పిల్లవాడు  ఏం చేస్తున్నాడు బంతిని తన్నుతున్నాడు, కాబట్టి ఇక్కడ తన్నడం” verb అవుతుంది. 

Object  (The ball), “బాలు పిల్లవాడి యొక్క ప్రభావానికి గురి అవుతున్నది, లేదా శిక్షకు గురి అవుతున్నది కాబట్టి ఇక్కడ Ball ఆబ్జెక్ట్ అవుతుంది.”.

Example 3:

 Ramana drives a car “రమణ కారు నడుపుతాడు.”

Subject (Ramana),“రమణ  కారు నడుపుతున్నాడు, అనగా పనిచేస్తున్నాడు, కాబట్టి రమణ సబ్జెక్ట్ అవుతాడు.”

Verb  (Drives), రమణ ఏం పని చేస్తున్నాడు, కారు నడుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ  కారు “నడపడంverb  అవుతుంది.

Object (The Car), “కారు సబ్జెక్టు అయిన రమణ యొక్క ప్రభావానికి గురి అవుతున్నది, కాబట్టి ఇక్కడ Car ఆబ్జెక్ట్ అవుతుంది.”

పై విదంగా subject + verb + object, ఈ రూపంలో ఒక సెంటెన్స్ వుంటే దానిని active voice సెంటెన్స్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకొనేది అంతా active voice లోనే. 

Subject, verb, object ఈ మూడింటి గురించి  వివరంగా తెలుసుకుందాం.

1.SUBJECT:

ఈ సబ్జెక్టులు రెండు రకాలు:

1). Singular subjects: ఒక వాక్యంలో పనిచేసే వ్యక్తి ఒక్కరే ఉన్నట్లయితే, అతనిని  సింగులర్ సబ్జెక్ట్ అంటారు.

2). Plural subjects: ఒక వాక్యంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు అయితే, వారిని ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటారు.

Singular subjects: ఒక వాక్యంలో పనిచేసే వ్యక్తి ఒక్కరే ఉన్నట్లయితే, అతనిని  సింగులర్ సబ్జెక్ట్ అంటారు.

Singular subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

1) First Person:   I (నేను)
2)  Second Person      You (నీవు)
3)  Third Person  He (అతడు), She (ఆమె), It(ఇది), that (అది), 

 

Plural subjects: ఒక వాక్యంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు అయితే, వారిని ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటారు.

Plural subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

1).  First Person:    We (మేము/మనము)
2).  Second Person     You (మీరు)
3).  Third Person      They (వారు), those (వారు),

పైన గమనించినట్లయితే singulars మరియు plurals రెండింటిలో కూడా You ఉంది.

You, ( నీవు అనగా ఒక వ్యక్తి).

You, ( మీరు అనగా  ఇద్దరూ లేక అంతకంటే ఎక్కువ మంది).

కానీ రెండింటికి ఇంగ్లీషులో You నే వాడతారు.

మాట్లాడే వ్యక్తులను ఫస్ట్ పర్సన్ అంటారు.

మాట్లాడే వ్యక్తులకు ఎదురుగా ఉన్న వ్యక్తులను సెకండ్ పర్సన్ అంటారు.

మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉన్న వ్యక్తులను థర్డ్ పర్సన్ అంటారు.

మొత్తంగా  చెప్పాలంటే,

Singular subjects : I, He, She, It,

Plural subjects: We, You, They, Those.

ఇంకా మీరు సింగులర్ గా  ఉన్న ఒక Noun   ఏ విధంగా  ప్లూరల్ గా మారుతుందో తెలుసుకోవాలంటే క్రింది క్లిక్  చేయండి.  అక్కడికి వెళ్ళిన తర్వాత మరల మీ మొబైల్ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మరలా ఇక్కడికి వస్తారు.

 

 

2.VERBS

Tenses  నేర్చుకోవడానికి ముందు ‘verbs’ గురించి తెలుసుకోవాలి. verb అనగా క్రియ లేదా పని  అని అర్థం. ప్రతిరోజు మనం మాట్లాడే  ప్రతి మాటలో ఒక క్రియ కచ్చితంగా ఉంటుంది. వీటినిverbs అంటారు. వాక్య నిర్మాణంలో Verbs లేకుండా వాక్యాలను నిర్మించలేము.

ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి Subject,  .ఏ పని చేస్తున్నాడు,ఏ స్థితిలో ఉన్నాడు,ఏమి కలిగి ఉన్నాడు,

లాంటి విషయాలను verb మనకు వివరిస్తుంది.ఈ verbs ప్రధానంగా రెండు రకాలు.

A.Main verbs (ప్రదాన క్రియలు)

B.Helping verbs (or) auxiliary verbs ( సహాయక క్రియలు)

 

A.Verbs or Main verbs సబ్జెక్టు చేస్తున్న పనిని  తెలియజేసే వాటిని Main verbs  అంటారు. 

He runs every morning. అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడు.
She writes a letter to her friend. ఆమె తన స్నేహితురాలికి ఒక లేఖ రాస్తుంది.
They play football after school. స్కూల్ తర్వాత వాళ్ళు ఫుట్‌బాల్ ఆడతారు.
The sun shines brightly in the sky. సూర్యుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు.
I drink a glass of milk daily. నేను రోజూ ఒక గ్లాసు పాలు తాగుతాను.

పైన  రెడ్ కలర్ లో కనిపిస్తున్న పదాలనే Main verbs అంటారు. Verbs అనగా క్రియలు లేదా  చేసే పనులు అంటారు.

Run (పరిగెత్తు), write (వ్రాయు), Play(ఆడుట) , shine (ప్రకాశించు), Drink(త్రాగు).

Verbs లేకుండా వాక్యాలు నిర్మించలేము .క్రింద క్లిక్ చేసి Main verbs పేజీ కి వెళ్ళి చూడండి.  మీ ఫోన్ యొక్క బ్యాక్ బటన్ క్లిక్ చేయండి మరల ఇక్కడికే వస్తారు.  

 CLICK HERE .

 

B.Helping verbs (or) Auxiliary verbs:

వీటిని తెలుగులో సహాయక క్రియలు అంటారు. సెంటెన్సెస్ ని నిర్మించడంలో, verbs కి సహాయం చేస్తూ ఉండటం వలన వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు.  Tense నిర్మించడంలో క్రింది పేర్కొన్న సహాయక క్రియలను ఉపయోగిస్తారు.

DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD,

WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST

సహాయక క్రియలని  తిరిగి రెండు రకాలుగా విభజించారు.

అవి: A.Primary auxiliary verbs     B. Modal auxiliary verbs

A.Primary auxiliary verbs 

:DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, 

Primary auxiliary verbs వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు అవి.

“Do” forms : DO, DOES, DID 

“Be” forms : AM, IS, ARE, WAS, WERE,

“Have” forms: HAVE, HAS, HAD.

 

Doforms: ఒక వాక్యంలో వున్న సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడు, అనే దానిని వివరించడానికి ఉపయోగిస్తారు.

Beforms: సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

Havefroms:  సబ్జెక్టు ఏమి కలిగి  ఉన్నాడో తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

 

B. Modal auxiliary verbs

Tensesలో ఇవి మొత్తం 9: WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST

Model verbs: సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి.

కొన్ని సందర్భాలలో verbs లేని వాక్యాలలో సహాయక క్రియలు మెయిన్ వెర్బ్ గా పని చేస్తాయి.

Examples:  

1. He is a lawyer   అతను ఒక లాయర్

2.They are students  వారు విద్యార్థులు

3. He was farmer   అతను రైతుగా ఉండెను

పై ఉదాహరణలను గమనిస్తే, ఇటువంటి వాక్యాల నిర్మాణంలో verb లేకపోయినప్పటికీ, సహాయక క్రియలు అయిన is, are, was  లాంటివి, మెయిన్ వెర్బ్ గా పనిచేసి ఒక అర్థవంతమైనటువంటి వాక్య నిర్మాణాన్ని చేపడుతున్నాయి. వాక్య నిర్మాణంలో, మెయిన్ verbs కి సహాయం చేసినప్పుడు  మాత్రమే వీటిని సహాయక్రియలు అంటారు. 

పైన పేర్కొన్న సెంటెన్సెస్ అన్నిటి గురించి ఫోను ఫోను మీకు పూర్తిగా అర్థం అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్  కావాల్సిన అవసరం లేదు

3. OBJECT:

 పైన వివరించినట్లుగా, సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అయ్యే దానిని ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్టుగా ఒక మనిషి ఉండవచ్చు, జంతువు ఉండవచ్చు, లేదా ఒక ప్రదేశం ఉండవచ్చు, లేదా ఒక వస్తువైనా ఉండవచ్చు.ఆబ్జెక్ట్ ఎల్లప్పుడు సబ్జెక్టు యొక్క మాట వింటాడు, సబ్జెక్టు చెప్పిన పనిని చేస్తాడు, సబ్జెక్ట్ యొక్క ప్రభావానికి గురి అవుతాడు, లేదా సబ్జెక్టు యొక్క అనుభవం లోనికి  వస్తుంది